ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం విజయం సాధించిన విషయం తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అయితే ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చేయడానికి అడుగు ముందుకు వేసారు.ఈ సందర్భంగా ఏపీలో నాలుగు లక్షల వాలంటీర్ పోస్ట్‌ల లు తీస్తానని జగన్ చెప్పడం జరిగింది.ఈ మేరకు ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది ఏపీ ప్రభుత్వం.ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే..
*దరఖాస్తుల స్వీకరణ మొదలు:22-06-2019
*దరఖాస్తుల స్వీకరణ చివరి తేది:05-07-2019
*అప్లికేషన్ పరిశీలన:10-07-2019 నుండి 25-07-2019 వరకు మండల మరియు పట్టణ స్థాయి ఇంటర్వ్యూలు జరుగుతాయి.
*ఫైనల్ రిజల్ట్ వెల్లడి:01-08-2019
*ఎంపికైన వారికి శిక్షణ: 05-08-19 నుంచి 10-08-2019
*జాయినింగ్:15-08-2019
ఈ పోస్టులకు సంభందించి విద్యా అర్హతలు:
*గిరిజన ప్రాంతాల వారు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.పట్టణ ప్రాంతాల వారికైతే డిగ్రీ మరియు గ్రామాల వారు ఇంటర్ పూర్తయి ఉండాలి.
*వయస్సు 18-35 మధ్య ఉండాలి.
*గ్రామా మరియు పట్టణ వార్డుల్లో అక్కడ స్థానికులే అర్హులు.