రెండు లక్షల కోట్ల రూపాయల రేంజ్‌లో రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి చెప్పారు. నవరత్నాలతో పాటు ప్రభుత్వ దనం దుర్వినియోగం కాకుండా తాము పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి బుగ్గన చెప్పారు. జీఎస్టీ వచ్చిన తర్వాత కొత్త ఆదాయ మార్గాలు తగ్గిపోయాయని.. అయితే జీఎస్టీ నుంచి కూడా క్రమేణా ఆదాయం పెరుగుతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని సమతౌల్యమైన బడ్జెట్ రూపొందిస్తున్నామని వెల్లడించారు.అలాగే ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, సాయం చేయాలని కేంద్రాన్ని కోరాం. రాజధాని నిర్మాణానికి, పోలవరానికి సరిపడా నిధులు కేటాయించాలని విఙ్ఞప్తి చేశాం. పీఎం కిసాన్ నిధి నుంచి ఆరువేల రూపాయల మొత్తాన్ని పెంచాలని కోరాం. రైతులకు, స్వయం సహాయక బృందాలకు ఇచ్చే సున్నా వడ్డీ భారం కూడా కేంద్రమే భరించాలని విన్నవించాం. మూడు వారాల్లోగా సమతౌల్యమైన బడ్జెట్‌ను మీరు చూస్తారు. అవినీతి రహిత పరిపాలనే మా ధ్యేయం. చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నాం’అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
