ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తప్పదని తెలుస్తోంది. తాజాగా నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తూ తీర్మానించారు. ఆ విలీన ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తుంది. తాజా ఎన్నికల్లో బొక్కాబోర్లా పడ్డ టీడీపీకి మళ్లీ గట్టి షాకే తగలనుందని తెలుస్తోంది. మొత్తం నలుగురు రాజ్యసభ్యులు బిజీపీలోకి చేరి 24 గంటలు కాకముందే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నార్త్ విశాఖ ఎమ్మెల్యేగా ఉన్న గంటా మరో 15మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందట.. గంటాతో పాటు 15 మంది ఎమ్మెల్యేలు శ్రీలంకలో ఉన్నారని వారు నేరుగా ఢిల్లీ వెళ్లి బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. గంటాతో పాటు ఉన్న ఆ 15మంది ఎవ్వరా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయం నిజమైతే టీడీపీ పరిస్థితి ఏంటని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బోండా ఉమ తదితరులు ఉన్నట్టు తెలుస్తోంది.
Home / 18+ / గంటాతో పాటు శ్రీలంకలో ఉన్న 15మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిక
Tags ap Chandrababu ganta srinivas jagan mlas tdp ysrcp