తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణులు నేడు ఘనంగా సంబురాలు జరిపారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు సంబురాల్లో పాల్గొన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకాలు చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ వద్ద జరిగిన సంబురాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొనగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు వద్ద జరిగిన సంబురాల్లో ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు.
