Home / SLIDER / కాళేశ్వరానికి విద్యుత్ సరఫరా ఇలా..?

కాళేశ్వరానికి విద్యుత్ సరఫరా ఇలా..?

తెలంగాణలో బీడుబారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ముందుకు నడిపించడంలో విద్యుత్ అత్యంత ముఖ్యమైన భూమికను పోషించనున్నది. అత్యంత భారీమోటర్ల ద్వారా మేడిగడ్డ నుంచి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం.. సముద్రమట్టానికి 618 మీటర్ల పైన నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధమయింది. ఇందుకు కావాల్సిన ఇంధనం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లి. భారీ ఏర్పాట్లను పూర్తిచేసింది.

రోజుకు 2 టీఎంసీలు..
4992 మెగావాట్ల విద్యుత్..

మొదట రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన 4,992 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అనుగుణంగా.. టీఎస్‌జెన్‌కో ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా, ఇటు దీర్ఘ, స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ల మార్గాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు అవసరమయ్యే 2000 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయించాల్సిందిగా ఎన్టీపీసీని కోరారు. అత్యంత భారీ మోటర్లు ఉపయోగించే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతరాయంలేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా వ్యవస్థను రూ.2,890 కోట్లతో బలోపేతంచేశారు.

100 పంపులు

ఈ ప్రాజెక్టులో భాగంగా అనేకదశల్లో నీటిని ఎత్తిపోయడానికి వీలుగా 21 మెగావాట్లు, 30 మె.వా., 40 మె.వా., 106 మె.వా., 134.8 మె.వా., 139 మె.వా. సామర్థ్యంతో ఉండే మోటర్లు, పంపులను నడపాల్సి ఉన్నది. దాదాపు 100 పంపులను నడిపించడానికి కావాల్సిన విద్యుత్ సరఫరాకు ట్రాన్స్‌కో అన్ని ఏర్పాట్లుచేసింది. ఇందులోనూ 100 మెగావాట్లకుపైగా సామర్థ్యమున్న పంపులు 22 ఉండటం గమనార్హం.

17 సబ్ స్టేషన్లు..
1025 కి.మీ. సరఫరా లైన్లు..

కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం పంపులను నిర్వహించేందుకు ట్రాన్స్‌కో 17 ఈహెచ్‌వి సబ్‌స్టేషన్లను నిర్మించింది. 400 కేవీ సబ్‌స్టేషన్లు 6, అలాగే 220 కేవీ సబ్‌స్టేషన్లు 9, ఇంకా 132 కేవీ సబ్‌స్టేషన్లు రెండింటిని.. మొత్తం 17 సబ్ స్టేషన్లను నిర్మించారు. వీటికితోడుగా.. 114 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేశారు. 400/11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు 51, 220/11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు 55, 132/11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు 8.. మొత్తం 114 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ట్రాన్స్‌కో ఏర్పాటుచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో వివిధ దశల్లో నీటిని ఎత్తిపోసే విధంగా పంపుహౌస్‌లను ఏర్పాటుచేశారు. సముద్రమట్టానికి దాదాపు 618 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తాల్సిఉంటుంది. అక్కడి నుంచి గ్రావిటీ కెనాళ్ల ద్వారా తెలంగాణలోని రైతుల భూములకు నీళ్లు చేరుతాయి.

విద్యుత్ సరఫరా చిత్రం ఇలా..

మేడిగడ్డ: కాళేశ్వరం ప్రాజెక్టులో మొట్టమొదటి పంప్‌హౌస్ ఇదే. ఇక్కడ 40 మెగావాట్ల సామర్థ్యంతో నడిచే 11 పంపులను ఏర్పాటుచేశారు. ఇక్కడ మొత్తం 440 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా 220/11 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు.
అన్నారం: ఇక్కడ 40 మెగావాట్ల సామర్థ్యంతో ఉండే 8 పంపులను ఏర్పాటుచేశారు. దాదాపు 320 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా.. 200/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేశారు.
సుందిల్ల: ఇక్కడ కూడా 40 మెగావాట్ల సామర్థ్యంతో నీటిని ఎత్తిపోసే 9 పంపులను ఏర్పాటుచేశారు. మొత్తం 364 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా 400/220/11 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు.
మేడారం: ఇక్కడ 124.4 మెగావాట్ల సామర్థ్యంతో ఉండే 7 పంపులను ఏర్పాటుచేశారు. మొత్తం 875 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా 400 కేవీ సబ్ స్టేషన్‌ను నిర్మించారు.
రామడుగు: ఆసియాలోనే అత్యంత భారీపంపులను..139 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 7 పంపులను ఇక్కడ ఏర్పాటుచేశారు. ఇందుకు 977 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనావేశారు. ఇందుకోసం 400 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేశారు.
తిప్పాపూర్: ఇక్కడ 106 మెగావాట్ల సామర్థ్యంతో ఉండే 4 పంపులను ఏర్పాటుచేయగా.. వాటికి 428 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇందుకోసం 400 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు.
చంద్లాపూర్: ఇక్కడకూడా నాలుగు భారీ పంపులను 134.8 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి ఏర్పాటుచేశారు. ఇందుకు 544 మెగావాట్ల విద్యుత్ అవసరం. దీనికోసం 400 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేశారు.
తుక్కాపూర్: ఇక్కడ 43 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసే 8 పంపులను ఏర్పాటుచేశారు. ఇందుకు 348 మెగావాట్ల విద్యుత్ సరఫరాకోసం 400 కేవీ సామర్థ్యం ఉన్న సబ్‌స్టేషన్‌ను నిర్మించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat