Home / SLIDER / సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం

సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం

సీఎం కేసీఆర్ తెలంగాణకు పర్యాయపదంగా మారిపోయారు. తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా ఆయన రాష్ట్రాన్ని మహాద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఒకనాడు తెలంగాణ వస్తుందా అన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నేడు దిగ్విజయంగా ముందుకు సాగిపోతోంది. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తూ తనకు తానే సాటి అని చాటుకుంటోంది. ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణను ఒక్కతాటిపైకి తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్. ఆనాడు సబ్బండ వర్ణాలను ఏకం చేసి ఉద్యమాన్ని శిఖరస్థాయికి చేర్చారు. చివరకు ఢిల్లీ దిగి వచ్చింది. దశాబ్దాల కల సాకారమైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.
 
ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది కాబట్టే జనం కూడా 2014 ఎన్నికల్లో ఆయనకే పట్టం కట్టారు. టీఆర్ఎస్ కు మ్యాండేట్ ఇచ్చారు. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చింది.సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో అంతా కన్ఫ్యూజన్ ఉంది. రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది. ఖర్చు ఎంత ఉంది. అన్న క్లారిటీ లేదు. కానీ త్వరలోనే ఆ గందరగోళానికి సీఎం కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించారు. అద్భుతమైన పథకాలతో తెలంగాణ ప్రజల మన్ననలు పొందారు. ఇక్కడి పథకాలకు యావత్ దేశం అబ్బురపడింది. పథకాలంటే ఇలా ఉండాలి అని ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ నుంచి స్ఫూర్తి పొందాయి. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్ల పెంపు, రైతుబంధు లాంటి కనివినీ ఎరుగని పథకాలకు అందరూ సలాం చేశారు. సీఎం కేసీఆర్ కమిట్ వల్లే ఈ పథకాలకు అంకురార్పణ జరిగింది. దిగ్విజయంగా ఆ పథకాలు అమలవుతూనే ఉన్నాయి. రాష్ట్రం సాకారమైన తర్వాత సాధించిన మరో గొప్ప విజయం హైకోర్టు సాధన. చంద్రబాబు సర్కార్ ఎన్ని కొర్రీలు పెట్టినా… కేంద్రం సహకరించకపోయినా… సీఎం కేసీఆర్ దాని కోసం గొప్పగా పోరాడారు. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తారు. చివరకు సీఎం కేసీఆర్ ఒత్తిడి ఫలించింది. కేంద్రం దిగి వచ్చి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసింది.
 
సమైక్యరాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల కథ స్వరాష్ట్రంలోకి వచ్చేసరికి మారిపోయింది. సీఎం కేసీఆర్ ప్లానింగ్ పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయి. ముఖ్యంగా తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దేందుకు ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ విజయపరంపరలో ఓ మైలురాయిగా కీర్తింపబడుతోంది. ప్రపంచంలోనే వినూత్నమైన ఈ కాళేశ్వరం పట్టాలెక్కిన తీరు అమోఘం. అద్భుతం. అంతకుమించి ఇది విజయవంతంగా పూర్తయిన తీరు అనన్యసామాన్యం. సీఎం కేసీఆర్ కొన్ని వందల పాటు శ్రమించి.. మెదడును కరిగించి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు ఎప్పటికప్పుడు అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తూ పనులు ఆగమేఘాల మీద జరిగేలా చూశారు. దాని ఫలితంగానే కాళేశ్వరం మూడేళ్లలోనే విజయవంతంగా పూర్తయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.
 
ప్రాజెక్టులంటే ఏళ్లకు ఏళ్లు కడుతూనే ఉండడం కాదు.. సంకల్పం ఉంటే ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా త్వరగానే పూర్తిచేయొచ్చు అని చేసి చూపారు సీఎం కేసీఆర్. అందుకే సీఎం కేసీఆర్ పేరును కల్వకుంట్ల కాళేశ్వర్ రావుగా కీర్తిస్తున్నారు జనం.నాడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడం దగ్గర్నుంచి నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సాకారం చేసే వరకు ప్రతి విజయంలోనూ సీఎం కేసీఆర్ పాత్ర కీలకం. సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ ఇప్పుడు వెలిగిపోతోంది. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మన్ననలు అందుకుంటోంది. అందుకే సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి జననేతలు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి అరుదైన నాయకుడు సీఎం కేసీఆర్ పదికాలాలపాటు చల్లగా ఉండాలని జనమంతా కోరుకుంటున్నారు.
 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat