తన అందమైన గాత్రంతో తెలుగుతో పాటు దక్షిణాది ప్రేక్షకులందరి మనసులను ఆకట్టుకున్న ప్రముఖ సింగర్ గీతా మాధురి. బిగ్ బాస్ షో తర్వాత గీత మాధురి పెద్దగా మీడియా ముందుకు రాలేదు. గీతా మాధురి, ప్రముఖ నటుడు నందు 2014లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గీత మాధురి సింగర్ గా రాణిస్తుండగా, నందు సినిమాల్లో నటిస్తున్నాడు.అయితే సోషల్ మీడియాలో గీతా మాధురి తల్లి కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. గీతా సీమంతం వేడుకకి వెళ్లిన ఆమె స్నేహితులు పర్ణిక, అంజనా సౌమ్య, మాళవిక, శ్యామల వంటి వాళ్లందరూ పలు పోస్టులు పెట్టారు. అంతుకాదు గీతతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో అందరికీ గీత తల్లి కాబోతోందేమోనన్న అనుమానాన్ని కలిగింది. వెంటవెంటనే ఈ సీమంతం వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. క్రింది వీడియో చూడండి.
