టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు అందించారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా దానిని అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తామంతా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నామని చేరినవారు వెల్లడించారు. సుజనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశం ఆలోచన అందరికీ తెలుసని, తాము జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అన్నిఅంశాలు సాధ్యమైనంత త్వరగా సామరస్యపూర్వకంగా పరిష్కారం కోసం బీజేపీలో చేరుతున్నామన్నారు.. కానీ వీరి చేరికపై అటు బీజేపీలోను, వైసీపీలోను వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్ లో లక్షల కోట్ల అవినీతి బయటపడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుందన్నఆందోళనతోనే చంద్రబాబు బిజెపితో మళ్ళీ సయోధ్యకు తహతహలాడుతున్నారు. ముందుగా రాజ్యసభ సభ్యలను పంపించి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. వీళ్ల ద్వారా బిజెపి పెద్దలతో రాజీ కుదుర్చుకుని కేసుల నుంచి బయటపడే ప్లాన్. వేసారని సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, కంభంపాటిలపై విమర్శలు గుప్పించారు. అలాగే వీరు బీజేపీలో చేరడానికి వెయ్యికోట్లు ఇచ్చుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం విచారణ జరిపి లోకేశ్ కు శిక్షపడేటట్లు చేస్తే మోడి కాళ్లు పట్టుకుని బ్రతికి బయటపడవచ్చనే దురుద్దేశంతో వీరి పార్టీని రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్టు తెలుస్తోంది.