ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత, ఉద్యమ దిక్సూచి, సిద్దాంత కర్త స్వర్గీయ ప్రొ.జయశంకర్ సార్ 8వ వర్ధంతి సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ శాఖ అద్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాల వేసి తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనంపాటించి ఘనంగా సభ్యులు అందరూ నివాళులర్పించారు.
అనంతరం శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్ర గొప్పదన్నారు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే చివరి వరకు పనిచేసిన జయశంకర్ సార్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి మరియు జయశంకర్ సార్ కు ఉన్న అనుబంధం చాలా గొప్పది అని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్న తీరు, భవిష్యత్తులో జరగబోయే అభివృద్ది గురించి సభ్యులకు వివరించారు.
తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు జయశంకర్ సార్ చేసిన కృషి చాలా గొప్పదన్నారు, జయశంకర్ సార్ కన్న కలలను కేసీఆర్ గారు నిజం చేస్తూ.. ప్రపంచంలోనే అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరంను జాతికి అంకితం చేసిన శుభ సందర్భంగా సీఎం కెసిఆర్ గారికి రైతులకు రాష్ట్ర ప్రజాప్రతినిధులకు మా ఎన్నారై తెరాస బహరేన్ పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శులు పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, గుమ్ముల గంగాధర్, సెక్రటరీలు సంగేపు దేవన్న, రాజుకుమార్, జాయింట్ సెక్రటరీలు నేరెళ్ల రాజు, ప్రమోద్ బొలిశెట్టి, సాయన్న కొత్తూరు, బాజన్న, నడిపి సాయన్న, నరేష్ ఎల్లుల, సంతోష్, తదితరులు హాజరయ్యారు.
Post Views: 357