ప్రపంచ యోగ దినోత్సవమును ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు వెనువెంటనే 193 ప్రపంచ దేశాలు తమ మద్ధతును ప్రకటించాయి. తరువాత డిసెంబరు 11 న ఐక్యరాజ్యసమితి భారత ప్రధాని సూచించిన జూన్ 21 నాడు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవమును జరుపుకోవాలని అధికారిక ప్రకటన చేసింది.అయితే ఈ ప్రపంచ యోగ దినోత్సవ సందర్భంగా అసలు యోగ అంటే ఏమిటి,అవి ఎన్ని రకాలు ఉంటాయి,దానివల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వక్రాసనం :
ఈ ఆసనంలో శరీరం వంకరగా కన్పిస్తుంది. రెండుకాళ్లు ముందుకు చాపి కూర్చోవాలి.కుడి అరికాలు ఎత్తి ఎడమకాలు దగ్గరపెట్టాలి. కుడి అరచేతిని కుడి అరచేతిపై ఉంచాలి. ఇలా రెండు వైపులా చేయాలి. పదినిమిషాలుచేస్తే శ్వాస వేగం తగ్గుతుంది.
బ్రమరిప్రాణాయామం :
తుమ్మెద ధ్వని వచ్చేప్రాణాయామం ఇది.నిటారుగా కూర్చొని రెండు చెవుల్లో రెండు బొటన వేళ్లుపెట్టి ఉంచాలి. దీని వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. శరీర అంశాలు తొందరగా గుర్తుకొస్తాయి.
అనులోమ, విలోమ ప్రాణాయామం:
కళ్లు మూసుకొని నిటారుగా కూర్చోవాలి.రెండు కనుబొమ్మల మధ్య దృష్టిని సారించి కుడిచేతి బొటన వేలుతో ముక్కు రంద్రాన్ని మూసి ఎడమరంద్రం నుంచి గాలిని పీల్చి వదలాలి.దీని ద్వారా మనసుకు ప్రశాంతత దొరికి ఒత్తిడి తగ్గుతుంది.
వజ్రాసనం:
మోకాళ్ల క్రిందకు కాళ్లు మడిచి రెండు పాదాలపై కూర్చోవాలి. రెండు చేతులను మోకాళ్లపై ఉంచాలి.ఇలా రోజూ 15 నిమిషాలు చేస్తే సరిపోతుంది. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
శశాంకాసనం:
మోకాళ్లపై కూర్చొని రెండు చేతుల్ని నడుము వెనక్కి పెట్టి కలపాలి.. గట్టిగా శ్వాస పీల్చాలి.. శ్వాస వదిలేటపుడు క్రిందకు వంగి వదలాలి.. మళ్లీ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి. ఈ ఆసనం పదినిమిషాలు చేస్తే ఆందోళన తగ్గి సహనం పెరుగుతుంది.
పద్మాసనం :
నీటిపై పువ్వు తేలుతున్నట్లుగా ఈ ఆసనం ఉంటుంది. కుడి పాదం ఎడమ కాలి తొడపై ఉంచాలి. ఎడమపాదం కుడి కాలిపై తొడపై వేసుకోవాలి. ఇలా పదిహేను నిమిషాలు చేస్తే ఒకే విషయంపై ఏకాగ్రత ఉండే నైపుణ్యం పెరుగుతుంది.
నిశ్పంద ఆసనం:
మనస్సుకు స్పందన లేనితీరును తెలియజేస్తుంది. రెండు కాళ్ల మధ్య పది నుంచి పదిహేను అంగుళాలు దూరంలో కూర్చోవాలి. రెండు చేతుల్ని భూమిపై ఆనించి కూర్చొని తలను మెళ్లగా పైకి ఎత్తి శ్వాస పీలుస్తూ వదలాలి. దీనివల్ల చేసేపనిపై ఏకాగ్రత పెరుగుతుంది.
యోగా వల్ల కలిగే ఉపయోగాలు:
*యోగా మానవుని జీవన శైలిని సులభతరం చేయడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
*మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచడంతోపాటు జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.
*మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకుంది.
*భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంది.
*ఏ వ్యాయామంతో కూడా పోల్చి చూసినా యోగాలో ఉన్న చాలా విశిష్టతలు ప్రత్యేకంగా ఉన్నాయి.
*యోగకు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉంది.
*యోగా కేవలం శరీరంపై మాత్రమే కాదు.. మెదడు, ఆత్మ ఇలా అన్నింటిని వృద్ధి చేయడంలో యోగ కీలకపాత్ర పోషిస్తుంది.
*ఆరోగ్యం మెరుగుపడటానికి యోగాకు మించిన సాధనం లేదు.
*యోగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, నరాల లోపల ఏదైనా అడ్డుపడినా తొలగిస్తుందని వైద్యులు చెప్తున్నారు.
*క్రమం తప్పకుండా యోగ చేస్తే వృద్యాప్యంలో వచ్చే ఎముకల వ్యాధి, కీళ్ల నొప్పులు రాకుండా.