తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్ మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు. వీరికి ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎంలు జగన్, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కేసీఆర్‌తో పాటు హోమంలో పాల్గొన్నారు. ఇక మేడిగడ్డ వద్ద శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప మహోత్సవ యాగం కొనసాగుతోంది. ఈ యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. అక్కడ జలసంకల్ప యాగం, పూజలు కొనసాగుతున్నాయి. గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్టించిన వేదపండితులు.. అనంతరం పూజలు ప్రారంభించారు. వరుణ దేవుణ్ణి ఆహ్వానిస్తూ మహాసంకల్ప యాగం కొనసాగుతోంది.
