ఘత ఐదేళ్ళ పాలనలో టీడీపీ పార్టీ చేసిన దౌర్జన్యాలకు,అన్యాయాలకు ఏపీ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.అందుకే ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు.ఫలితమే వైసీపీ పార్టీ రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించి.దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.ఇక అసలు విషయానికి వస్తే చంద్రబాబు హయంలో రైతులు చాలా కష్టాలు పడ్డారు.దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించాడు.నకిలీ విత్తనాల మాఫియా చంద్రబాబు కనుసన్నల్లోనే విస్తరించిందని.విజిలెన్స్ దాడుల్లో రూ.2 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. కర్నూలు, గుంటూరు,కృష్ణా జిల్లాల్లో ప్రభుత్వ అండతో సీడ్ మాఫియా చెలరేగి పోయింది. వీళ్లంతా చంద్రబాబు సన్నిహితులేనాని విజయసాయి రెడ్డి అన్నారు. రైతులను కూడా వదిలిపెట్టలేదు కదా బాబూ? అని ప్రశ్నించారు.
నకిలీ విత్తనాల మాఫియా చంద్రబాబు కనుసన్నల్లోనే విస్తరించింది. విజిలెన్స్ దాడుల్లో రూ.2 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. కర్నూలు, గుంటూరు,కృష్ణా జిల్లాల్లో ప్రభుత్వ అండతో సీడ్ మాఫియా చెలరేగి పోయింది. వీళ్లంతా చంద్రబాబు సన్నిహితులే. రైతులను కూడా వదిలిపెట్టలేదు కదా బాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 21, 2019