తెలుగుదేశం పార్టీని వీడిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సంచలన వాఖ్యలు చేశారు. గతంలో తాను బీజేపీ యూత్ వింగ్‌లో సభ్యుడినని టీజీ వెంకటేశ్ తెలిపారు. అప్పటి నుంచే తనకు బీజేపీతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. పార్టీ మార్పుపై ఇప్పటికే ఎంపీలు సంతకాలు చేసి తాము రాజ్యసభ చైర‍్మన్‌కు అందచేశామన్నారు. తమను బీజేపీలో విలీనం చేయాలని లేదా ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వారం క్రితమే చంద్రబాబు నాయుడుని కలిశానని, అయితే పార్టీని వీడొద్దని ఆయన చెప్పారన్నారు. ప్రజా నిర్ణయంలో పాటు, తమ ప్రాంత అభివృద్ధి మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ వాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంటే టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నట్లు వారం క్రితమే తెలుసు..అందుకే విదేశాలకు వెళ్లారా..ఇదంతా కపట నాటకం అంటూ వైసీపీ అభిమానులు అంటున్నారు. మరి కొందరు అయితే కేసుల నుండి బయటపడాలంటే బీజేపీలో చేరండి..2024 ఎన్నికల సమయంలో తిరిగి టీడీపీలోకి రండి అని చెప్పినట్లు కామెంట్ లు పెడుతున్నారు.
