ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓటమితో టీడీపీ నేతల మైండ్ బ్లాంక్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం అవ్వడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొందరు టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అవినీతిలో కూరుకుపోయిన నేతలు తప్పనిసరిగా కేసులు ఎదుర్కోవల్సి ఉండటంతో కాపాడే వారి కోసం ఎదురుస్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని విశ్వసనీయ సమచారం. చంద్రబాబు వీదేశాలకు వెళ్ళగానే అనేక పరిణామాలు జరిగాయి. గురువారం సాయంత్రం టీడీపీకి చెందిన 4 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇది జరిగి 24 గంటలకు కూడా గడవక ముందే… తెలుగుదేశం పార్టీకి చెందిన మరో 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అవుతున్నారని సమాచారం అందుతోంది.అది కూడ ఈరోజే వీరంతా బీజేపీలో చేరబోతున్నారంట. గంటా నేతృత్వంలో వీరంతా బీజేపీలో జాయిన్ అవుతున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే.. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. బాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదాను కోల్పోతాడు. అయితే, గంటాతో పాటు బీజేపీలో జాయిన్ కాబోతున్న ఆ 15 మంది ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది.
