నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల తీసుకున్న ఒక వినూత్న నిర్ణయంతో చరిత్ర సృష్టించారు. ఈ నిర్ణయం ఏమిటో ఆ పార్టీ రాజ్యసభ పక్షనేత,ఎంపీ విజయసాయిరెడ్డి మాటల్లో “పోలీసుల వీక్లీ ఆఫ్ అమలు చేసే విషయంలో మానవతను చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని” ఆయన తెలిపారు. దేశంలోనే ఇటువంటి సాహసం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందన్నారు. ‘మీ సీఎం మాటిస్తే వెనక్కు తగ్గరంట గదా’ అని పలువురు ఎంపీలు సెంట్రల్ హాల్లో తనతో అన్నారని ట్వీట్ చేశారు.
