ఏపీ సీఎం జగన్ పరిపాలనను వేగవంతం చేసారు. ఎప్పటికప్పుడు స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువరోజుల్లోనే తన మార్క్ పాలన చూపిస్తున్నారు. సీఎం ఆదేశాలతో ఈనెల 13 నుంచి ఫిట్‌నెస్ లేని 624 స్కూల్ బస్సులపై కేసులు బుక్ చేసారు. మొత్తం ఇప్పటి వరకూ 357 బస్సులను సీజ్ చేసారు. ఈ వివరాలన్నింటిని ప్రజలముందు ఉంచుతామని రవాణా, సమాచార శాఖామంత్రి పేర్ని నాని తెలిపారు. సీఎం విద్యార్ధుల భద్రత విషయంలో ఏవిధంగానూ ఉపేక్షించవద్దన్నారని ఆయన తెలిపారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్ పాసులు మూడేళ్లకు ఒకసారి తీసుకునేలా మొదటి ఫైలుపై సంతకం చేశారాయన. అలాగే రాష్ట్రంలోని మెట్రో నగరాల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
రవాణా శాఖ కార్యాలయాల్లో కూడా లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఇకపై కొత్త వాహనాల కొనుగోలు సమయంలో డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. 24 గంటల్లోనే ఆర్టీవో అప్రూవల్ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారని ఆయన తెలిపారు. అయితే ప్రజా ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకునేందుకు సీఎం ఏమాత్రం తడబాటు పడటం లేదని అర్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా ప్రతీ ఒక్కరికీ న్యాయం చేయాలని జగన్ ఉన్నారని స్పష్టమవుతోంది. జగన్ నిర్ణయాలతో అక్రమ వ్యాపారాలు చేస్తున్న పచ్చపార్టీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి.