ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది.ఇది 1882లో బళ్లారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితము. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు మరియు చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, మరియు వజ్రాల త్రవ్వకము ముఖ్యమైన పరిశ్రమలు.అయితే ఇక్కడ పర్యాటక ప్రదేశాలు కూడా ఎక్కువే ఉన్నాయి.అవి ఏమిటి ఇక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1.క్లాక్ టవర్:
*ఈ క్లాక్ టవర్ ని 1947 ఆగష్టు 15న నిర్మించారు.
*స్వాతంత్ర ఉద్యమాలకు చిహ్నంగా ఈ గడియార స్తంభాన్ని నిర్మించడం జరిగింది.
2.గుత్తి:
* గుత్తి అంటే ఇది ఒక పురాతనమైన కోట.
*ఈ కోటను చాళుక్యుల కాలంలో కట్టబడిన కోటగా చెబుతారు.
3.చింతల వెంకటరమణ దేవాలయం:
*ఇది అనంతపురంలోని తాడిపత్రిలో ఉన్న వైష్ణవ ఆలయం.
*సుమారు 5ఏకరాల స్థలములో పెన్నా నది ఒడ్డున నిర్మించబడినది.
4.తిమ్మమ్మ మర్రిమాను:
*ఇది అనంతపురం జిల్లా గూటిబయలు అనే గ్రామంలో ఉంది.
*దక్షిణ భారతదేశంలో ఇదే అతి పెద్ద చెట్టుగా చెబుతారు.
5.పుట్టపర్తి:
*పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా వారి ఆశ్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
*ఈ ఆశ్రమాన్ని సందర్శించడానికి నిత్యం లక్షల మంది భక్తులు వస్తారు.
6.లేపాక్షి:
*ఇది హిందూపురం పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.
*ఇక్కడ వీరభద్ర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది.
*ఈ ఆలయం అధ్బుతమైన శిల్పకళా వైశిష్ట్యంతో అందంగా దర్శనమిస్తుంది.
7.రాయదుర్గం కోట:
*ఇది రాయదుర్గం బస్టాండు కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.
*ఈ కోట విజయనగర రాజుల యొక్క సేనాపతి నిర్మించారు.
8.పెన్న అహోబిల క్షేత్రం:
*ఇది అనంతపురం జిల్లా,ఉండవల్లి మండలానికి చెందిన గ్రామం.
*ఇక్కడ నరసింహస్వామి వారి ప్రాచీన పుణ్యక్షేత్రం ఉంది.
9.పెనుకొండ కోట:
*దీనిని విజయనగర రాజుల రెండవ రాజధానిగా పిలుస్తారు.
*బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో శాశనాలు ఉన్నాయి.
10.యాడికి గుహలు:
*యాడికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనుప్పలపాడు అనే గ్రామంలో ఉన్నాయి.
*ఇక్కడ అందమైన గుట్టలు,సరస్సులు,పొలాలు జనాల్ని ఆకర్షిస్తాయి.