ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ బుధవారం నుంచే పోలీసులకు వారాంతపు సెలవులు అమలు అవుతున్నాయి.. తాజాగా అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పోలీసుశాఖలో మొత్తం 30 విభాగాలున్నాయని, వాటిని అధ్యయనం చేసి 19మోడళ్లను రూపొందించాం అన్నారు. ఐటీ డేష్ బోర్డ్ ద్వారా పారదర్శకంగా అందరికీ వీక్లీ ఆఫ్‌లను నెలరోజుల్లో అమలులోకి తెస్తామని చెప్పారు. దీనిపై ప్రతీనెలా ఫీడ్ బ్యాక్ లు తీసుకుంటామన్నారు. ఇప్పటికే విశాఖ, కడప జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీ ఆఫ్‌లు అమలవుతున్నాయని, ఇబ్బందులను గమనించి వాటిని పరిష్కరిస్తామన్నారు.
పనిఒత్తిడి వల్ల పోలీసు శాఖలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు, మరణాలు జరుగుతున్నాయని 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న పోలీసు సిబ్బందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. వీక్లీ ఆఫ్‌ల వల్ల పోలీసులకు ఒత్తిడి తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే ఈ డిమాండ్ ఎప్పటినుంచో ఉంది.. జగన్ సీఎం అవ్వకముందు కూడాఇదే చెప్పారు. నీతికి, న్యాయానికి కట్టుబడి ఉండండి.. తలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయండి తప్ప గుంటనక్కలకు కాదని చెప్తూ వచ్చారు. చంద్రబాబు అండతో తనను ఇబ్బందులకు గురిచేసిన పోలీసులకూ అదే చెప్పారు. అలాగే ప్రతిపక్షనేతగా తాను ఇచ్చిన హామీకి కట్టబడి వీక్లీ ఆఫ్ ఇచ్చారు. సీఎం నిర్ణయం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.