క్రికెట్ ఈ మాట వింటే చాలు ప్రతీఒక్కరిలో ఒక ఊపు వస్తుంది.ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.ఒకప్పుడు టెస్ట్,వన్డే ఈ రెండు ఫార్మాట్లు జరిగేవి.అయితే టీ20 లు వచ్చిన తరువాత ప్లేయర్స్ కు అవధులు లేకుండా పోతున్నాయి.ఈ ఫార్మాట్ వచ్చిన తర్వాత అందరు సిక్సర్లు వీరులు అయిపోయారనే చెప్పాలి.తక్కువ బాల్స్ లో ఎక్కువ కొట్టడం ఇప్పుడు చాలా సులభం అయిపొయింది.ప్రస్తుతం మనం ఇప్పుడు తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన క్రికెటర్స్ గురించి తెలుసుకుందాం..
ఏ బీ డివిల్లియర్స్ :
*ఏ బీ డివిల్లియర్స్ సౌతాఫ్రికా జట్టు ఆటగాడు.
*ఇతను 31బంతుల్లోనే సెంచరీ చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు.
కోరీ ఆండర్సన్:
*కోరీ ఆండర్సన్ న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్.
*ఈ ప్లేయర్ 36బంతుల్లో సెంచరీ కొట్టాడు.
షాహిద్ ఆఫ్రిది:
*షాహిద్ ఆఫ్రిది పాకిస్తాన్ కు చెందిన ఆటగాడు.
*37బంతుల్లో సెంచరీ కొట్టాడు,ఇతడిని బూమ్ బూమ్ ఆఫ్రిది అని కూడా పిలుస్తారు.
మార్క్ బౌచర్:
*మార్క్ బౌచర్ సౌతాఫ్రికా ప్లేయర్ మరియు వికెట్ కీపర్.
*ఈ వికెట్ కీపర్ 44బంతుల్లో సెంచరీ కొట్టాడు.
బ్రియాన్ లారా:
*బ్రియాన్ లారా వెస్టిండీస్ ప్లేయర్ మరియు మాజీ కెప్టెన్.
*ఈ ప్లేయర్ 45బంతుల్లో సెంచరీ చేసాడు.
జెస్సి రైడర్:
*జెస్సి రైడర్ న్యూజిలాండ్ ఆల్ రౌండర్.
*ఈ ఆల్ రౌండర్ 46బంతుల్లో సెంచరీ కొట్టాడు.
సనాత్ జయసూరియ:
*జయసూరియ శ్రీలంక ప్లేయర్ మరియు మాజీ కెప్టెన్.
*ఈ ప్లేయర్ 48బంతుల్లో సెంచరీ కొట్టాడు.
కెవిన్ ఓ బ్రెయిన్:
*కెవిన్ ఓ బ్రెయిన్ ఐర్లాండ్ జట్టు ఆల్ రౌండర్.
*ఈ ప్లేయర్ 50బంతుల్లో సెంచరీ చేసాడు.
విరాట్ కోహ్లి:
*విరాట్ కోహ్లి భారత్ జట్టు ప్రస్తుత కెప్టెన్.
*ఈ ప్లేయర్ 52బంతుల్లో సెంచరీ సాధించాడు.