టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఆయన రైతులకు చేసిన అన్యాయం చిన్నపాటిది కాదు.రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి తీరా గెలిచిన తరువాత తాను ఇచ్చిన మాటలు గాలికి వదిలేసాడు.చంద్రబాబు ఇచ్చిన హామికి రైతులు బ్యాంక్లో అప్పులు కట్టకపోవడం,దీంతో బ్యాంకర్స్ నుండి నోటిసులు రావడంతో కొంతమంది రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు.అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి చంద్రబాబు అండ్ కో పై విరుచుకుపడ్డారు.
రుణమాఫీ హామీతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేసారని,గడిచిన ఐదేళ్లపాటు మాఫీ సొమ్ము చెల్లించకుండా రోజుకో కథ చెబుతూ వచ్చారని తీరా ఓడిన తర్వాత కొత్త ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని సిగ్గు లేకుండా డిమాండు చేస్తున్నారని మండిపడ్డారు.మాట తప్పిన చంద్రబాబును రైతులు నిలదీయాలని ఆయన అన్నారు.అంతేకాకుండా ఓటమి తప్పదని గ్రహించే లోకేశ్ చేత ఎమ్మెల్సీకి రాజీనామా చేయించకుండానే మంగళగిరి నుంచి బరిలో దింపారు. ఎన్నికలకు ముందే తమ వాళ్ళకు పోస్టింగులు, ప్రయోషన్లిచ్చారు అన్నారు. పోలింగ్ తర్వాత అప్పులు తెచ్చి మరీ కంట్రాక్లర్ల బిల్లులు చెల్లించారని ఇప్పుడేమో ఓటమికి కారణాలు తెలియట్లేదంటూ నంగనాచి డ్రామాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
రుణమాఫీ హామీతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారు. ఐదేళ్లపాటు మాఫీ సొమ్ము చెల్లించకుండా రోజుకో కథ చెబుతూ వచ్చారు. తీరా ఓడిన తర్వాత కొత్త ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని సిగ్గు లేకుండా డిమాండు చేస్తున్నారు. మాట తప్పిన చంద్రబాబును రైతులు నిలదీయాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 19, 2019