Home / TELANGANA / చిన్నారిపై ఆత్యాచారానికి హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్టు

చిన్నారిపై ఆత్యాచారానికి హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్టు

గత రాత్రి 9నెలల చిన్నారి శ్రీహితపై ఆత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితుడు శాయంపేట మండలం వసంతపూర్‌ గ్రామానికి చెందిన పోలేపాక ప్రవీణ్‌ను బుధవారం హన్మకోండ పొలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వివరాలను వెల్లడిస్తూ. శాయంపేట ప్రాంతానికి చెందిన నిందితుడు గత కోద్ది కాలంగా హన్మకోండ ప్రాంతంలో ఓ హోటల్లో క్లీనర్‌గా పనిచేసే వాడు. ఈ క్రమంలో నిందితుడు గత రాత్రి అనగా 18-06-19 తేది ఆర్థరాత్రి సమయంలో హన్మకోండ కుమార్‌ పల్లి ప్రాంతంలో ఒంటరిగా తిరుగతున్న నిందితుడు, ఇదే ప్రాంతానికి చెందిన మహిళ తన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితతో కల్సి మేడపై నిద్రిస్తుండగా, నిందితుడు ప్రవీణ్‌ చిన్నారిశ్రీహిత ఎత్తుకెళ్ళి ఇదే ప్రాంతంలో నిర్మానుష్యంగా వున్న ప్రాంతంలో చిన్నారిపై ఆత్యాచారం అనంతరం హత్యకు పాల్పడ్డాడు.

ఇదే క్రమములో ఆర్థరాత్రి 2.30 సమయంలో మేడపై నిద్రిస్తున్న తన ప్రక్కనే నిద్రిస్తున్న తన కుమార్తే కనిపించక పోవడంతో మృతురాలి తల్లి తన తమ్ముడుకి తెలపడంతో తమ ఇంటిపై కిరాయివుండే బ్యాచులర్స్‌కు మృతురాలి మామయ్య తెలపడంతో పాటు వారికి చెందిన రెండు సెల్‌ఫోన్లు కనబడకుండా పోవడంతో మృతురాలి మామయ్య చుట్టు ప్రక్కలవారితో కల్సి తాను నివాసం వుందే వీధిలో చిన్నారి కోసం గాలిస్తుండగా, ఇదే సమయంలో నిందితుడు చిన్నారిని టవల్‌లో చుట్టి తన భుజాన వేసుకోని వెళ్ళుతుండగా గుర్తించిన భాధితురాలి మామాయ్య మరియు చుట్టు ప్రక్కల ప్రజలు నిందితుడుని పట్టుకోనేందుకు ప్రత్నించడంతో నిందితుడు తన భుజంఫై వున్న చిన్నారిని అక్కడే వదిలి తప్పించుకోని పోయేందకు ప్రయత్నిస్తున్న నిందితుడిని పట్టుకోని డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక ప్రజల అదుపులో వున్న నిందితుడి పోలీసులు అదుపులోకి తీసుకోగా, టవల్‌లో వున్న చిన్నారి శ్రీహితను గుర్తించిన మామయ్య సదరు చిన్నారిలో ఎలాంటి కదలిక లేకపోవడంతో పాటు చిన్నారి శరీరం నుండి అధిక రక్తస్రావం కావడాన్ని గుర్తించిన శ్రీహిత మామయ్య చిన్నారిని స్థానిక హస్పటల్‌ తీసుకపోగా చిన్నారి శ్రీహితను పరీక్షించిన డాక్టర్లు మరణించిసట్లుగా నిర్థారించారు.

ఈ సంఘటన సంబంధించి మరణించిన చిన్నారి శ్రీహిత మామయ్య హన్మకోండ పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు అధారంగా నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టు చేసి సెక్షన్‌ 366,302,376ఎ, 376ఎబి, 379 ఐ.పి.సి సెక్షన్లతో పాటు 5(యం) రెడ్‌ విత్‌ 6 ఆఫ్‌ పోక్సో యాక్ట్‌ 2012 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లుగా పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat