ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.జగన్ దెబ్బకు అధికార పార్టీ ఐన టీడీపీ చతకలపడింది.ప్రస్తుతం జగన్ ప్రమాణస్వీకారం చేసిన మొదలు తాను ప్రతీ పని సక్రమంగా నిర్వహిస్తున్నారు.గాడి తప్పిన ప్రతీ శాఖను లైన్ లో పెట్టాడు.ఇప్పుడు టీడీపీ నాయకుల పని పట్టడానికి రెడీగా ఉన్నారనే చెప్పాలి.ఎందుకంటే టీడీపీ అంటే ప్రస్తుతం ఏపీలో అన్యాయాలు,అక్రమాలకూ అడ్డాగా మారిందనే చెప్పాలి.2014ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన విషయం అందరికి తెలిసిందే.తీరా గెలిచిన తరువాత ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేదు.ఆ పార్టీ నాయకులైన ప్రత్తిపాటి పుల్లారావు,నారాయణ,బుద్దా వెంకన్న,నారా లోకేష్,కోడెల ఇలా అందరూ కూడా ప్రజలను మోసం చేసి కొన్ని వేల కోట్లు నొక్కేసారు.ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఒక్కొకరికి చుక్కలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే మాజీ స్పీకర్ కోడెల ఫ్యామిలీ పై చాలా కేసులు కూడా ఉన్నాయి.వీరిని పక్కన పెడితే ఇక మాజీ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వస్తే..ఈయన ఒక పెద్ద మాఫియా అనే చెప్పాలి.పేరుకే ఆర్ధిక మంత్రి తప్ప రాష్ట్రాన్ని మంచి చేసింది అయితే ఏమీ లేదనే చెప్పాలి.ఈయన టీడీపీ సీనియర్ నాయకుడు కూడా.
See Also : తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!
2014 ఎన్నికల్లో తన తమ్ముడైన యనమల కృష్ణుడిని తుని నియోజకవర్గం నుండి నిలబెట్టగా..అక్కడ నుండి వైసీపీ నుండి దాడిసెట్టి రాజా నిలబడి గెలిచారు.చంద్రబాబు యనమలకి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది.అన్నయ్య అండతో తమ్ముడు ఇష్టారాజ్యంగా దౌర్జన్యాలు,అక్రమాలు చేసేవాడు.రాజా అధికారం లేనప్పటికీ వారిపై పోరాటం చేసిన ఫలితం లేకపోయింది.ఇసుక మాఫియా,మట్టి,గ్రావెల్ ఇలా ప్రతీ విషయంలో వాళ్ళ అరాచకం ఉండేది.ఒక ఆర్ధిక మంత్రి అయిఉండి కూడా కనీసం తన సొంత నియోజకవర్గాని మంచిగా చేసుకోలేకపోయాడు. తన సొంత ప్రయోజనాలకు మాత్రం ప్రభుత్వ సొమ్మ విచ్చలవిడిగా దుర్వినియోగం చేసాడు.ఆర్ధిక మంత్రిగా కొన్ని కోట్లు ప్రజా ధనాన్ని నొక్కేసాడు.అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆ నియోజకవర్గం నుండి మళ్ళీ వాళ్ళే పోటీ చేయగా ఈసారి కూడా రాజానే గెలిచాడు.ప్రజలు అవినీతికి అడ్రస్‌గా మారిన యనమలకు సరైన్న బుద్ధి చెప్పారు.తొందరలో అన్నదమ్ముల్లు ఇద్దరుజైలుకు వెళ్ళడం కాయమని తెలుస్తుంది.
See Also : పీఆర్సీపై త్వరలోనే సమావేశం.. సీఎం కేసీఆర్
See Also : చంద్రబాబుపై జగన్ ఫైర్..బాబుకి ముచ్చెమటలు !