లోక్‌సభ స్పీకర్‌గా రాజస్థాన్‌కు చెందిన ఎంపీ ఓమ్ బిర్లా ఎన్నికయ్యే అవకాశముంది. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్‌లోని కోట పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందిన భాజపా నేత ఓమ్ బిర్లాను స్పీకర్ అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు ఎన్డీయే వర్గాలు తెలిపాయి. లోక్‌సభ కొత్త స్పీకర్‌గా గతంలో మేనకా గాంధీ సహా అనేక మంది భాజపా సీనియర్ల పేర్లు వినిపించాయి. అయితే చివరకు ఓం బిర్లా వైపు ఎన్డీయే వర్గాలు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఓం బిర్లా కోటా నుంచి రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు కోటా దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌నరైన్ మీనాపై బిర్లా విజయం సాధించారు.