కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైందని, అధిష్టానం తప్పుడు నిర్ణయాలతో పార్టీకి ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మార్చనందుకే కాంగ్రెస్ ఓటమిపాలైందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా లాభం లేదన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా పట్టించుకునే పరిస్థితి లేదంటూ పార్టీపైనా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాపైనా విమర్శలు చేశారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయని, ఇప్పుడు దేశమంతా ఆ పార్టీ వైపే చూస్తోందని అన్నారు. బీజేపీలో చేరడంపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. ‘ఇక అంతా అయిపోయింది.. చేసేదేమీ లేదు’ అన్నారు.
See Also : తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!
అయితే, కోమటిరెడ్డి అనూహ్య ఎత్తుగడలతో కాంగ్రెస్ పార్టీని వీడేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనంత తాను పార్టీని వీడి బీజేపీలో చేరితే సస్పెన్షన్ వేటు పడుతుందని భావిస్తున్న కోమటిరెడ్డి.మరోవైపు చేరికకు లైన్ క్లియర్ చేసుకునేందుకు విమర్శలు చేస్తున్నట్లు సమాచారం. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా పార్టీతో సస్పెన్షన్ వేటు వేయంచుకోవచ్చునని, దీంతో అనర్హత భయం లేకుండానే…బీజేపీలో చేరవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
See Also : పీఆర్సీపై త్వరలోనే సమావేశం.. సీఎం కేసీఆర్
See Also : చంద్రబాబుపై జగన్ ఫైర్..బాబుకి ముచ్చెమటలు !