Home / EDITORIAL / రికార్డులకు కేంద్ర బిందువుగా కాళేశ్వరం

రికార్డులకు కేంద్ర బిందువుగా కాళేశ్వరం

ప్రాణహిత జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించాలనే ఆలోచనతో ఉమ్మడి ఏపీ సర్కారు మహారాష్ట్రతో 1978లోనే ఒప్పందం చేసుకుంది. కానీ గోదావరిపై ప్రాజెక్టులు కడితే ధవళ్వేరం బరాజ్‌కు నీటి ప్రవాహం తగ్గుతుందనే కుయుక్తితో సమైక్య పాలకులు దశాబ్దాలపాటు విస్మరించారు. చివరకు 2007లో తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మించి 160 టీఎంసీల నీటిమళ్లింపు ద్వారా 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ. 17,875 కోట్ల అంచనా వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. కానీ.. 19 నెలలపాటు తట్టెడు మట్టి పనులు చేయకుండానే వ్యయాన్ని రూ. 38,500 కోట్లకు, తదుపరి 2010లో రూ. 40,300 కోట్లకు పెంచారు. కానీ.. దీనికి కీలకమైన మ హారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని మాత్రం పట్టించుకోలేదు. 2014 జూన్ వరకు ప్రాజెక్టుపై రూ.7వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా.. గోదావరి నది నుంచి నీటిని మళ్లించేందుకు డిజైన్ చేసిన తమ్మిడిహట్టి బరాజ్ పనుల్ని అసలు మొదలే పెట్టలేదు. అంటే తల వదిలి.. ఎడాపెడా కాల్వలు, టన్నెల్స్ తవ్వడంతోనే సంతృప్తి చెందారు. ఫలితంగా ప్రజాధనం రూ. 7వేల కోట్లకు పైగా ఖర్చయింది. ఒక్క నీటి చుక్క పొలాలకు పారలేదు. తమతో ఒప్పందం చేసుకోకుండా వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతుందంటూ 2013లో అప్పటి మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చౌహాన్, అప్పటి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తీవ్ర హెచ్చరికతో లేఖరాశారు. కానీ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉలకలేదు.. పలుకలేదు.
 
    అంగీకరించని మహారాష్ట్ర
తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభు త్వం వెనువెంటనే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై దృష్టిసారించింది. ఈ ప్రాజెక్టును తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించి, త్వరితగతిన రైతులకు నీళ్లు ఇవ్వాలని ఆకాంక్షించింది. ఆ మేరకు అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు 2014 జూలైలో ముంబై వెళ్లి మహారాష్ట్ర జలవనరులశాఖ మంత్రితో సమావేశమయ్యారు. కానీ.. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్నది. అక్కడ ఎన్నికలు పూర్తై, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా 2015 ఫిబ్రవరి 15న ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు తామే దీనిని వ్యతిరేకించి, ఇప్పుడెలా అంగీకరిస్తామంటూ ఆయన కూడా ఆసక్తిచూపలేదు. ఈ సమయంలోనే కేంద్ర జల సంఘం నుంచి 2015 మార్చి 4న ప్రాణహిత- చేవెళ్ల డిజైన్‌లోని (కాంగ్రెస్ హయాంలో తయారుచేసింది) కీలక లోపాలను ఎత్తి చూపుతూ లేఖ వచ్చింది. ఒకవైపు మహారాష్ట్ర అభ్యంతరం, మరోవైపు డిజైన్‌లోనే లోపం.. ఇక ఒక్క అడుగు కూడా ముందుకుపోలేమన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది.
    కేంద్ర జల సంఘం ఎత్తి చూపిన లోపాలు
తమ్మిడిహట్టి దగ్గర 273.14 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని డీపీఆర్‌లో పేర్కొన్నా.. వాస్తవానికి నీటి లభ్యత 165 టీఎంసీలేనని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. అందులో ఎగువ రాష్ర్టాలు 63 టీఎంసీలు వాడుకుంటే మిగిలేది 120 టీఎంసీలైతే.. తమ్మిడిహట్టి నుంచి 160 టీఎంసీలు ఎలా తరలిస్తారు? 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా అందిస్తారు? అని ఘాటుగా విమర్శించింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో కేవలం 11.43 టీఎంసీల నీటి నిల్వ కోసం రిజర్వాయర్లు ప్రతిపాదించారు. దీంతో ఈ నిల్వ సామర్థ్యం సరిపోనందున కొత్త రిజర్వాయైర్లెనా నిర్మించుకోవాలని లేకపోతే ఆన్‌లైన్ రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించింది. తమ్మిడిహట్టి నుంచి 160 టీఎంసీలను లిఫ్టు చేయాల్సి ఉండగా.. డీపీఆర్‌లోని పంపుల సామర్థ్యాన్ని పరిశీలిస్తే 90 టీఎంసీలు మాత్రమే ఉందనే మరో బండారాన్ని బయటపెట్టింది. ఇదేదో కాంట్రాక్టర్ల హితంకోసం చేపడుతున్నదా? అనే అనుమానాన్నీ వ్యక్తం చేసింది.
    నదికే నడక నేర్పిన రీడిజైనింగ్
మహారాష్ట్ర అభ్యంతరం.. కేంద్ర జల సంఘం ఎత్తిచూపిన సాంకేతిక లోపాలు.. ప్రాణహిత-చేవెళ్ల అడుగు ముందుకు వేయలేని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఒక ఇంజినీర్‌లా రీడిజైనింగ్ చేపట్టారు. ఆ క్రమంలో లైడార్ సర్వేలు, నిపుణుల సూచనలు, కేంద్ర జలసంఘం రికార్డుల పరిశీలన, వ్యాప్కోస్ నివేదిక.. ఇలా జరిగిన మేధోమథనం ద్వారా రూపుదిద్దుకున్నదే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. బీడు భూముల్లోకి పారాల్సిన గోదావరిజలాలు దిగువకు పరుగులు పెడుతుంటే.. వాటిని బరాజ్‌ల్లో ఒడిసిపట్టి నదీమార్గంలోనే వెనక్కి తరలించేలా రూపొందించిన రీడిజైన్.. నదికే నడక నేర్పింది. తమ్మిడిహట్టి బరాజ్ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేసి.. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వంటి వరుస బరాజ్‌ల ద్వారా తరలించే గోదావరిజలాలతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద దాదాపు 40 లక్షల ఎకరాలకు జీవంపోసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. నదీ ప్రవాహమార్గంలోనే రివర్స్‌బుల్ పంపింగ్ ద్వారా సుమారు 35వేల ఎకరాల ముంపును నదీగర్భానికే పరిమితం చేయడమనేది కాళేశ్వరం ప్రత్యేకత.
     112 గంటల లైడార్ సర్వే..
దేశంలోనే తొలిసారిగా సాగునీటి ప్రాజెక్టు డిజైన్ కోసం తెలంగాణ సర్కారు అత్యాధునిక లైడార్ సర్వేను చేపట్టింది. 2015 ఆగస్టులో 29 రోజులపాటు 112 గంటలు, 3550 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వేతో గోదావరి సాంకేతిక గుట్టును బయటికితీశారు. అందులో భాగంగానే అత్యధిక నీటి లభ్యత ఉన్న ప్రాంతంగా మేడిగడ్డను గుర్తించి.. అక్కడ ప్రధాన బరాజ్ నిర్మాణాన్ని చేపట్టారు.
 చారిత్రాత్మక ఒప్పందం..
మేడిగడ్డ బరాజ్ నిర్మాణానికిగాను మహారాష్ట్రతో ఒప్పందం చేసుకునేందుకు 2016 మార్చి 8న తెలంగాణ-మహారాష్ట్ర అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత జరిగిన బోర్డు సమన్వయ, స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో రెండు రాష్ర్టాల ఇంజినీర్లు విస్తృతంగా సాంకేతిక చర్చలు జరిపారు. తుదకు సాంకేతిక అంశాలన్నీ కొలిక్కిరావడంతో 2016 ఆగస్టు 23న తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో రెండు రాష్ర్టాల మధ్య చారిత్రక అంతర్రాష్ట్ర ఒప్పందం సాకారమైంది. అంటే కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే డిజైన్ చేసి, ప్రాజెక్టును పట్టాలెక్కించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. నీటి లభ్యత విషయంలో మేడిగడ్డ మేలైన ఎంపికగా కేంద్ర జల సంఘం కూడా ధ్రువీకరించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat