ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.. గతంలో తమ్మినేని సీతారాం మంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా పర్యటనకు వెళ్లారట.. అమెరికాకు వెళ్లి అక్కడ ఫ్లైట్ దిగగానే సూటు, బూటు వేసుకున్న సీతారామ్ ను అమెరికా అధికారులు ఆయనే సీఎం అనుకుని బోకేలు, ఫ్లవర్స్, షేక్ హ్యాండ్ ఇచ్చి అందరూ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారట.. ఆయన పక్కనే నిల్చున్న చంద్రబాబుని ఎవ్వరూ పట్టించుకొలేదు. దీనితో చంద్రబాబు హర్ట్ అయిపోయారట.. అలాగే చూస్తుండిపోయాడట.. పోనీ వాళ్లతో మాట్లాడదామంటే చంద్రబాబుకు ఇంగ్లిషు రాదట.. దీంతో వెంటనే అక్కడున్న కమ్మసామాజికవర్గానికి చెందిన వ్యక్తులు, తానా అధికారులతో సీఎం తమ్మినేని కాదు, ప్రక్కనుండి ఫీలవుతున్న వ్యక్తే సీఎం చంద్రబాబని చెప్పారట.. దాంతో మళ్లీ అప్పుడు తమ్మినేని చేతిలొ ఉన్న బొకేలు తీసి,చంద్రబాబు చేతిలొ పెట్టారట అమెరికా అధికారులు.. అయితే ఇండియా వచ్చాక ఇదంతా మనసులొ పెట్టుకున్న చంద్రబాబు తమ్మినేనిని మంత్రి పదవినుండి తొలగించి, ప్రాధాన్యం లేని ప్రచారకమిటిలొ వేశారట.. ఇప్పుడు అలాంటి తమ్మినేనిని చంద్రబాబు అధ్యక్ష్యా అధ్యక్షా అంటుంటే తమ్మినేని సభను కంట్రోల్ చేస్తున్నారు.
See Also : తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!
See Also : పీఆర్సీపై త్వరలోనే సమావేశం.. సీఎం కేసీఆర్
See Also : చంద్రబాబుపై జగన్ ఫైర్..బాబుకి ముచ్చెమటలు !