నీతిఆయోగ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదాకోసం పోరాటం చేయలేదని దుష్ప్రచారం చేయడం సరికొద్ద దుమారానికి తెరలేపింది. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం స్ట్రక్చరల్ గా ముందుకెళ్తున్నారు. గత 5ఏళ్ల టీడీపీ అవినీతి, చిత్తశుద్ధిలేని పాలనతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని స్పష్టంగా నీతి ఆయోగ్ లో మాట్లాడారు. మౌలిక రంగాల్లో పెట్టుబడుల లేమి, విద్యా, వైద్య రంగాల పతనావస్థ పెరిగిపోయిందన్నారు. ప్రత్యేకహోదా మాత్రమే జీవధారగా మిగిలిందని చెప్పారు. హోదాపై ఉన్న అపోహలు ప్రచారంలో కొనసాగుతున్నాయి. 14 వ ఆర్థిక సంఘం హోదాకు వ్యతిరేకంగా ఎలాంటి సిఫార్సులు చేయలేదని ఆ కమిటీ సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖను నీతి ఆయోగ్ ముందుంచారు.
దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు.తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చంద్రబాబు కు చుక్కలు చూపించాడు.2018 ఫిబ్రవరిలో విశాఖలో అట్టహాసంగా జరిపిన పార్టనర్‌షిప్ సమిట్‌లో రూ.4.50 లక్షల కోట్ల పెట్టుబడులపై సంతకాలు జరిగాయని చంద్రబాబు ప్రకటించారని,100 కోట్ల వృథా ఖర్చు తప్ప రూపాయి కూడా పెట్టుబడి రాలేదని ఆయన అన్నారు.నీతి ఆయోగ్ బిత్తరపోయిందట ఈయన స్టేట్‌మెంట్ చూసి ఐదేళ్ళు ప్రజలు మోసం చేసారని అన్నారు.