ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు మొదలౌవుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎకంగా 175 సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ అధినేత , ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక చరిత్ర సృష్టించాడు. టీడీపీ కేవలం 23 పీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక జనసేనా అయితే ఓకే ఒక్క చోట గెలిచింది. అయితే ఎన్నికల ముందు వైసీపీలోకి వలసలు ఎలా జరిగాయో తెలిసిందే.. తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ చెంత చేరాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో బాగాంగానే వైసీపీలోకి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి ‘గుడ్ బై’ చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీలోకి వెళ్ళేందుకు గంటా సన్నాహాలు చేసుకుంటున్నారని, ఇప్పటికే ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే, నిజానికి, ఎన్నికలకంటే ముందే గంటా శ్రీనివాసరావు, వైపీలో చేరిపోవాలనుకున్నారు. ఆయన రాకను వైసీపీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో, గంటా వెనక్కి వుండిపోవాల్సింది.. అనూహ్యంగా అవంతి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు, ఆయనకు ఇప్పుడు మంత్రి పదవి కూడా వచ్చింది.రాష్ట్రంలో ఎటూ టీడీపీకి భవిష్యత్తు లేదు గనుక, తన భవిష్యత్తుని వెతుక్కోని మరోపక్క, రెండో ఆప్షన్‌గా భారతీయ జనతా పార్టీని కూడా గంటా శ్రీనివాసరావు ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా ఓకే.. టీడీపీలో మాత్రం వుండడం మాకిష్టం లేదు..’ అని గంటా అనుచర వర్గం చెబుతున్నరంట.