ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కేవలం 23మంది ఎమ్మెల్యేలే గెలవడంతో మిగిలినవారు అసెంబ్లీలో మాట్లాడేందుకు మొగ్గు చూపడంలేదు.. దీంతో ప్రతీ విషయానికీ అచ్చెన్నాయుడే మాట్లాడుతున్నారు. అలాగే ప్రభుత్వంలోని సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడుతున్నా అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తున్నాడు.. ఇప్పటివరకూ బాగానే ఉన్నా అచ్చెన్నాయుడు మాత్రం ప్రభుత్వంలోని సభ్యులు లేవనెత్తిన ప్రతీ అంశానికీ కమిటీ వేయండి.. విచారణ చేయండి.. అని కోరుతున్నారు.
See Also : పవన్ కళ్యాణ్ ఆ ఒక్కటి అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ అసెంబ్లీకి రాలేడా.?
See Also : గురుకులాలతో కేజీ టు పీజీ విద్యకు బలమైన పునాదులు.
అలాగే పోలవరం.. పట్టిసీమ, రాజధాని, గ్రామీణాభివృద్ధి ఇలా ఏ అంశం మాట్లాడినా.. తెలుగుదేశం గవర్నమెంట్ ఒకవేళ అవినీతి చేస్తే సిబిఐ ఎంక్వైరీ చేయాలి.. తెలుగుదేశం గవర్నమెంట్ ఒకవేళ అవినీతి చేస్తే ఎంక్వైరీ చేయాలి.. అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే హౌస్ లో మాట్లాడిన మాటలకు, చేసిన డిమాండ్లకు చాలా పవర్ ఉంటుంది.. ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలపై రివ్యూలు జరుపుతుంది.. ఈ నేపధ్యంలో ఒకవేళ ప్రభుత్వం ఎంక్వయిరీలు వేసి విచారణకు ఆదేశిస్తే పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే అచ్చెన్నాయుడి వ్యవహారశైలి చూస్తున్నవారు మాత్రం ఈ అచ్చెన్నాయుడే చంద్రబాబుని పోలిసులకు పట్టించేలాగ వున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.