విజయనగరం జిల్లా..ఈ పేరు చెబుతే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది విజయనగరం కోటనే,ఇది ఆంధ్రప్రదేశ్ లోని కొత్త జిల్లా.ఈ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు ఎక్కువనే చెప్పాలి.అంతేకాకుండా రాజులకు సంబంధించిన కోటలు కూడా ఎక్కువే. కళాశాలలు,సాంఘీకంగా, సాహిత్యంగా ఇలా అన్ని రకాలకు ముందు ఉంది.మరి ఇలాంటి జిల్లా కోసం మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం..
విజయనగరం కోట:
*1713 సంవత్సరంలో ఈ కోటను విజయనగరం రాజులు నిర్మించారు.
*ఈ కోట మొత్తం కొండరాళ్ళతో నిర్మించడం జరిగింది.
మోతీ మహాల్:
*1869లో ఈ మోతీ మహల్ నిర్మాణం జరిగింది.
*మహారాజు గారి న్యాయపతి ఐన విజయరామరాజు గారు దీనిని నిర్మించారు.
క్లాక్ టవర్:
*ఈ క్లాక్ టవర్ నగరం మధ్యలో ఉంటుంది.
*దీని ఎత్తు 68అడుగులు కాగా..అప్పట్లో దీని నిర్మాణానికి 5400మాత్రమే ఖర్చు అయ్యింది.
అలకనంద ప్యాలస్:
*అతిధులు కోసం ఈ ప్యాలస్ ను 1857లో నిర్మించారు.
*ప్రస్తుతం ఇది పోలీస్ వారి 5వ బెటాలియన్ ప్రధాన కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు.
మహారాజా విద్యాసంస్థలు:
*దీనిని విజయరామరాజు గారు 1919లో స్థాపించారు.
*ఇది ఒక మంచి సంగీత కళాశాల అని చెప్పాలి
శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం:
*ఈ అమ్మవారు విజయనగర ప్రజలకు కోర్కెలు తీర్చే తల్లీ అంటారు.
*ఇక్కడ జరిగే జాతరకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు.
బొబ్బిలి కోట:
*ఈ బొబ్బిలి కోట స్థాపకుడు పెదరాయుడు.
*ప్రస్తుతం ఈ కోట రెండవ అంతస్తులో మ్యూజియం ఉంది.
తాటిపూడి జలాశయం:
*ఇది విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో ఉంది.
*1963-68 సంవత్సరంలో ఈ తాటిపూడి ఆనకట్టను నిర్మించారు.
రాజ్ మహల్:
*ఈ రాజ్ మహల్ ను మహారాజా వెంకట స్వెత చలపతి రంగరావు నిర్మించారు.
*ఇది ముఖ్య అతిధుల ఆతిధ్యం కోసం కట్టారు.
బొబ్బిలి వీణ:
*ఇది వీణల తయారీకి ప్రసిద్ధి చెందినది.
*ఇక్కడ వీణల తయారీకి పసుపు మరియు సంపంగి కర్ర ఉపయోగిస్తారు.