గుంటూరు జిల్లా…ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పాలి.ఇక్కడ పర్యాటకులు తిలకించడానికి అందమైన ప్రకృతితో ఉన్న కొండలు, లోయలు, బీచ్,దేవాలయాలు ఎలా చాలానే ఉన్నాయని చెప్పాలి.ఇంక చెప్పాలంటే తేలికపాటి నూలు దుస్తులు ఇక్కడ బాగా ప్రసిద్ధగాంచినవి.అయితే ఈ గుంటూరు జిల్లాలో పర్యాటక ప్రదేశాలు ఏంటో ఒక్కసారి మనం కూడా చుసెద్ధం..
1.అమరావతి స్తూపం:
*ఇది గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరానికి కుడి ప్రక్కన ఉంది.
*ఇది 18వ శతాబ్దములో వెలుగులోకి వచ్చిందని చెబుతారు.
2.ఎత్తిపోతల జలపాతాలు:
*ఇక్కడ అందమైన ప్రకృతితో కలిగిన కొండలు మరియు గుహలు ఉంటాయి.
*ఇక్కడే మొసళ్ళు పెంచ్చే కేంద్రం కూడా ఉంది.
3.ఉండవల్లి:
*ఇది గుంటూరు నుండి 30కిలోమీటర్ల దూరంలో ఉంది.
*ఇక్కడ పురాతనమైన దేవాలయాలు,గుహలు ఉంటాయి.
4.ఎన్టీఅర్ మానససరోవరం:
*ఇది గుంటూరుకి 6కిలోమీటర్ల దూరంలో తక్కెళ్ళపాడు వద్ద ఉంది.
*ఇది సుమారు 55ఎకరాల్లో సువిశాలమైన పూలతోటలతో,అందమైన దృశ్యాలతో ఉంటుంది.
See Also : పవన్ కళ్యాణ్ ఆ ఒక్కటి అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ అసెంబ్లీకి రాలేడా.?
5.చేబ్రోలు:
*ఇది గుంటూరుకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
*ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మదేవాలయం బాగా ప్రసిద్ధి చెందినది.
6.ఉప్పల పాడు పక్షుల ప్రాంగణం:
*ఈ పక్షుల ప్రాంగణం గుంటూరు కి 5కిలోమీటర్ల దూరంలో ఉంది.
*ఇక్కడ 40జాతులకు సంభందించిన పక్షులు నివాసముంటాయి.
7.మంగళగిరి:
*ఇది విజయవాడకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
*ఇక్కడ పానకాలస్వామి దేవాలయం, లక్ష్మీ నరసింహస్వామి బాగా ప్రసిద్ధి.
8.కారం పూడి:
*ఇది మాచర్లకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.
*ఇక్కడ చెన్నకేశవ స్వామి దేవాలయం ప్రసిద్ధి.ఈ దేవాలయాన్ని బ్రహ్మనాయుడు నిర్మించాడు.
9.దుర్గి:
*ఇది మాచర్లకు 10కిలోమీటర్ల దూరంలో ఉంది.
*ఇక్కడ రాతి బొమ్మల చెక్క పాఠశాలకు మంచి పేరు ఉంది.
10.గుత్తికొండ:
*ఇది దట్టమైన అడవిలో ప్రశాంతమైన అడవిలో ఉంది.
*కొన్ని వేలమంది ఋషులు ఇక్కడ తపస్సు చేయడం జరిగింది.