వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నా ఆత్మ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆసక్తికర వాఖ్యలు చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ స్వీకార మహోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి పై స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆసక్తికర వాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు పంచ ప్రాణాలు అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి కావాలని గత ఐదేళ్లు పాటు విశాఖశారదా పీఠం ఎంతగానో శ్రమించిందిని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని విశాఖ శారదాపీఠం యావత్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. జగన్ సీఎం కావాలని.. దేవాలయాల వ్యవస్థ బాగుపడాలని, హిందూ దేవాలయ భూములు ఆక్రమణలకు గురికాకుండా ఉండాలంటే జగన్ సీఎం కావాలని కోరుకున్నామని తెలిపారు. మరో పదిహేను సంవత్సరాలు సీఎంగా జగన్ పనిచేయాలని స్వరూపానందేంద్ర సరస్వతి ఆకాంక్షించారు.
