రానా దగ్గుబాటి,సాయి పల్లవి జంటగా నటించబోతున్న చిత్రం విరాట పర్వం.ఇటీవలే వీరిద్దరూ ఈ కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా,ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా పూజ కూడా నిర్వహించారు.ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.ఇందులో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటించనుండగా, రానా పొలిటికల్ లీడర్ గా నటించనున్నారు.ఇప్పటికే లీడర్, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో పొలిటికల్ రోల్ చేసిన రానా ఇప్పుడు మూడోసారి అదే రోల్ చేయనున్నాడు.అంతేకాకుండా ఇందులో వీరిద్దరూ లవర్స్ అని కూడా తెలుస్తుంది.చాలా ఏళ్ల తరువాత టబు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టనుంది.
