ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆయన శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అని ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా నిన్న ఆదివారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ”టీడీపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని”అణుబాంబు పేల్చారు.
See Also : పవన్ కళ్యాణ్ ఆ ఒక్కటి అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ అసెంబ్లీకి రాలేడా.?
అక్కడితో ఆగకుండా తనకు కూడా ఆఫర్ వచ్చిందని.. అయితే తాను రాజకీయాల నుండి తప్పుకున్నందున నేను ఏపార్టీలో చేరను అని ఆయన తేల్చి చెప్పారు. తాజాగా అదే పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి అయిన పరిటాల సునీత కుటుంబం టీడీపీకి ఝలక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని వార్తలు అనంతపురం జిల్లాలో వినిపిస్తోన్నాయి. ఇటీవల జరిగిన నవ్యాంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాల్లో విజయదుంధుభి సాధించి సర్కారును ఏర్పాటు చేసింది. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అనంతపురానికి చెందిన మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబానికి ఉన్నదానికంటే ఎక్కువగా భద్రత కల్పించాలని సంబంధిత శాఖతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలిచ్చిన సంగతి తెల్సిందే.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పరిటాల సునీత తన కుమారుడు శ్రీరామ్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు జిల్లా రాజకీయాల్లో చక్కెర్లు కొడుతున్నాయి.కనుచూపుమేరలో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడం.. ఇంకో పదేళ్ల దాక పార్టీను ముందుకు నడిపిస్తారని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంలేకపోవడం.. పార్టీ మారితే తన కుమారుడు అయిన పరిటాల శ్రీరామ్ పోలిటికల్ జీవితం భవిష్యత్తుకై మాజీ మంత్రి పరిటాల సునీత ఆలోచిస్తున్నారు అని అనంతపురం జిల్లా రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి. చూడాలి మరి పరిటల సునీత ఔటా..?ఇన్నా అని?