ప్రపంచకప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ పై తమ రికార్డు అలానే నిలబెట్టుకుంది.భారతదేశం మొత్తం గర్వించేలా మనవాళ్ళ పాక్ ను చిత్తూ చిత్తుగా ఓడించారు.ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 89పరుగులు తేడాతో విజయం సాదించింది.తొలిత టాస్ గెలిచి పాక్ ఫీల్డింగ్ తీసుకుంది,బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ ఓపెనర్స్ పాక్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. హిట్ మాన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీ సాధించాదించి ఏకంగా 140పరుగులు జోడించాడు.కెప్టెన్ విరాట్ కోహ్లి 65పరుగులు చేయగా,మరో ఓపెనర్ రాహుల్ కూడా అర్ధశతకం కొట్టాడు.
See Also : సచివాలయంలో జగన్ కొత్త రూల్…టీడీపీ నేతల మైండ్ బ్లాంక్.
See Also : టీడీపీ షాకింగ్ న్యూస్.. జగన్ సీఎం కావాలని జూ.ఎన్టీఆర్ కోరుకున్నారా..?
దీని ఫలితమే భారత్ 50ఓవర్స్ లో 336పరుగులు సాదించింది.అనంతరం చేసింగ్ కి వచ్చిన పాకిస్తాన్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది.ధావన్ ప్లేస్ లో వచ్చిన విజయ్ శంకర్ వరల్డ్ కప్ లో తాను వేసిన మొదటి బంతిలోనే వికెట్ తీయడం విశేషం.ఆ తరువాత ఫకర్ జామన్ తో కలిసి బాబర్ అజమ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసాడు.కాసేపు స్కోర్ ను ముందుకు నడిపించగా కుల్దీప్ బౌలింగ్ లో బాబర్ అవుట్ అయ్యాడు.ఆ తరువాత హార్దిక్ పాండ్య వరుసగా రెండు వికెట్స్ తీసాడు.దీంతో పాక్ పతనం మొదలైందని అందరికి అర్దమైంది.చివరకు ఓటమి పాలయ్యారు.