Home / SLIDER / ప్రాజెక్టుల దిక్సూచి కాళేశ్వరం..!

ప్రాజెక్టుల దిక్సూచి కాళేశ్వరం..!

సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు.. నాగార్జునసాగర్ ప్రారంభోత్సవ సందర్భంగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అన్న మాటలివి. కాలానుగుణంగా ఈ ఆధునిక దేవాలయాలే రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారాస్ర్తాలుగా రూపాంతరం చెందాయి. సముద్రంలోకిపోయే నదీజలాల్ని ఒడిసిపట్టి బీడు భూముల్లో సిరులు పండించాల్సిన సాగునీటి ప్రాజెక్టులు రాజకీయ నాయకులకు ఓట్లు రాల్చే నిర్మాణాలుగా మారాయి. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ చూసినా ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తికావాలంటే కనీసంగా మూడు-నాలుగు ఎన్నికలు గడిచిపోవాల్సిందే! కానీ ఇదంతా గతం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసి వాటి గతిని మార్చి చూపించారు. ఆధునిక దేవాలయాలంటే ఎన్నికల అస్ర్తాలు కావని, రైతుల జీవితాల్లో వెలుగును నింపే నిర్మాణాలని రుజువు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం మూడేండ్లలో పూర్తిచేసి తెలంగాణ సర్కారు చిత్తశుద్ధిని చాటిచెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఏకంగా 13 జిల్లాల్లోని బీడుభూములకు జీవం పోయడమనేది తెలంగాణ ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మార్చేవిధంగా ఉన్నదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా 2-3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టే ప్రాజెక్టులే దశాబ్దాల తరబడి కొనసాగి నత్తకు నడక నేర్పేలా ఉంటే.. స్థిరీకరణసహా దాదాపు 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే సామర్థ్యమున్న కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేండ్లలోనే నీటి విడుదలకు సిద్ధమవడం దేశ సాగునీటి రంగంలోనే అరుదైన రికార్డని నిపుణులే నిర్ధారిస్తున్నారు.
Project

తక్కువ సమయం.. బహుముఖ ప్రయోజనం

ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగా రూపొందిన కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధపాత్రిపదికన మూడేండ్లలోనే నీటి విడుదలకు సిద్ధం చేయడం వెనుక బహుముఖ ప్రయోజనం దాగి ఉన్నది. ఏటా సముద్రంలో కలుస్తున్న వేల టీఎంసీల గోదావరి జలాల్ని బీడుభూముల్లోకి మళ్లించడం ద్వారా దశాబ్దాలుగా గోస తీస్తున్న తెలంగాణ రైతాంగానికి శాశ్వత ఉపశమనం కలిగించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. 2015లో ప్రారంభమైన ప్రాణహిత- చేవెళ్ల రీడిజైనింగ్ ప్రక్రియ.. ఆధునిక లైడార్ సర్వే తర్వాత 2016లో ఓ కొలిక్కి వచ్చింది.

మేడిగడ్డ వద్ద ప్రధాన బరాజ్ సహా వరుస బరాజ్‌లతో గోదావరి జలాలను తరలించేలా కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ రూపొందించారు. 2016 మే 2న సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే కార్యాచరణ మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు పనుల్ని మొదలుపెట్టడంతోపాటు మరోవైపు కీలకమైన అంతర్రాష్ట్ర ఒప్పందంపైనా చకాచకా పావులు కదపడం.. ముఖ్యంగా సీఎం కేసీఆర్ తన రాజనీతిజ్ఞతతో మహారాష్ట్ర ప్రభుత్వంతో నెరిపిన సంప్రదింపులు జలదౌత్యాన్ని విజయవంతం చేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ నెల 21న నీటిని విడుదల చేయనుండటం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనున్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat