తెలుగు సినిమా పరిశ్రమలోని యువ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మొన్న వరుణ్ తేజ్, నిన్న నాగశౌర్య స్వల్ప ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా యువ హీరో సందీప్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వారం రోజులుగా కర్నూలు నగరంలో తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్ జరుగుతోంది. శనివారం బాంబ్ బ్లాస్టింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఫైట్ మాస్టర్ చేసిన తప్పిదం వల్ల సందీప్ కిషన్ ఛాతీ, కుడిచేతిపై గాజుముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడి సిబ్బంది సందీప్‌ను నగరంలోని మైక్యూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. తెనాలి రామకృష్ణ మూవీ గురించి సందీప్ కిషన్, హన్సిక హీరో హీరోయిన్లుగా ‘తెనాలి రామకృష్ణ- బిఏబిఎల్’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. భూమిక చావ్లా కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బేనర్లో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. మురళి శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.