ఈనెల 21న తెలంగాణ రాష్ట్రంలో కొత్త పండుగ జరగనుంది.! రాష్ట్రవ్యాప్తంగా..కుల,మతాల
See Also : ప్రియదర్శి నటనకు కేటీఆర్ ఫిదా..!!
See Also : టీడీపీ షాకింగ్ న్యూస్.. జగన్ సీఎం కావాలని జూ.ఎన్టీఆర్ కోరుకున్నారా..?
21న రాష్ట్రమంతా కాళేశ్వరం పండుగ జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు. ఈనెల 19న హైదరాబాద్ తెలంగాణభవన్‌లో నిర్వహించే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ ఇదే నిర్దేశించనున్నారు. పల్లె నుండి రాజధాని దాకా కాళేశ్వర ప్రారంభ ఉత్సవం జరగాలని, ఊరూవాడా కాళేశ్వరం జలాలొస్తాయని పండుగ చేసుకోవాలని, టీఆర్‌ఎస్ శ్రేణులు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని, పెద్ద ఎత్తున కదలాలని సీఎం పిలుపునివ్వనున్నారు. రాష్ట్రమంతా కాళేశ్వర సంరంభం ధూమ్‌ధామ్‌గా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రగతిని మలుపుతిప్పే ప్రాజెక్టుగా, దేశంలోనే రికార్డుసమయంలోనే పూర్తయిన ప్రాజెక్టుగా అనేక ప్రత్యేకతలున్న కాళేశ్వరం ప్రారంభోత్సవం కూడా అదే స్థాయిలో జరిగే సన్నాహకం మొదలైంది. గ్రామాల్లో స్వీట్లపంపిణీ కూడా పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. కార్యకర్తలు, నేతలు ఊరూరా సంబురాలు చేయనున్నారు. జూలైలో కాళేశ్వరం జలాలు బీళ్ళలో పరుగెత్తనున్నాయి. మేడిగడ్డ నుండి మిడ్‌మానేరుదాకా గోదారమ్మ దుంకుతూ పరుగెత్తే సంబురం కోసం తెలంగాణ ఆశగా ఎదురుచూస్తోంది.
See Also : సచివాలయంలో జగన్ కొత్త రూల్…టీడీపీ నేతల మైండ్ బ్లాంక్
కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద భారీగా మూడురోజుల పాటు యాగం నిర్వహించాలని, అత్యంత వైభవోపేతంగా దీనిని చేపట్టాలని మొదట భావించినా సమయం తక్కువగా ఉండడం, ముహూర్త సమయం దగ్గరలో రావడంతో ప్రస్తుతం ఆ భారీ కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నారు. త్వరలోనే నీటివిడుదల ద్వారా సమయం చూసుకుని.. భారీ యాగం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద హోమ క్రతువు నిర్వహించనుండగా, గోదావరి జలాలను ఎత్తిపోసే స్థలం వద్ద వైదిక క్రతువు నిర్వహించాలని నిర్ణయించారు. క్రుతువుల నిర్వహణకు సీఎం సూచనమేరకు ఇప్పటికే శృంగేరీ పీఠానికి చెందిన పండితులు ఆయా స్థలాలను పరిశీలించారు. ఈనెల 21న మొత్తం మేడిగడ్డ పరిసరాలు వేదఘోషలతో మార్మోగనుండగా, అంగరంగ వైభవంగా, అట్టహాసంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభంకానుంది. ఇక ముగ్గురు ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్‌రెడ్డి, ఫడ్నవిస్ హాజరయ్యే కార్యక్రమం కావడంతో భద్రతాపరంగా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.