2019 మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన సుమన్ రావు (20) కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో 2019లో థాయిలాండ్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశం తరపున మిస్ ఇండియా సుమన్‌రావు ప్రాతినిథ్యం వహించనుంది. అలాగే రన్నరప్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్, సెకండ్ రన్నరప్‌గా తెలంగాణకు చెందిన సంజనా విజ్ నిలిచారు. ఇక మిస్ ఇండియా యునైటడ్ కాంటినెంట్స్ కిరీటాన్ని బీహార్‌కి చెందిన శ్రేయా శంకర్ గెలుచుకున్నారు. ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గత ఏడాది సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రేయా రావు కామవరపు… ఈ ఏడాది తన కిరీటాన్ని సంజనా విజ్‌కి బహుకరించింది. ఈ సందర్భంగా కిరీటం సొంతం చేసుకున్న సుమన్ రావు మాట్లాడుతూ ‘జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే , దాన్ని సాధించడానికి శరీరంలోని అణువణువూ మనకు సహకరిస్తూ విజయం వైపు అడుగులు వేయడానికి దోహదపడుతుందని’ తెలిపారు.
