ప్రపంచకప్ లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో మ్యాచ్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.వరల్డ్ కప్ మే30 ని మొదలైంది,అయితే ఇప్పటివరకూ ప్రతీ జట్టు సగం మ్యాచ్ లు ఆడడం జరిగింది.భారత్ విషయానికి వస్తే ఇప్పటివరకూ మూడు మ్యాచ్ లు జరగగా రెండు మ్యాచ్ లు విజయం సాధించిన భారత్ ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది.ఎప్పుడు ప్రపంచకప్ జరిగిన అందులో ఇండియా ఎవరితో తలబడిన సాదారణంగా చూసే ప్రేక్షకుల ఒకే ఒక్క మ్యాచ్ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.అదే పాకిస్తాన్ జట్టు,యావత్ భారత్ ఆ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.ప్రపంచకప్ లో ఇప్పటివరకూ పాక్,ఇండియా మధ్య జరిగిన అన్ని మ్యాచ్ లలో ఇండియానే గెలిచింది.ఇప్పటికే పుల్వామా ఘటనతో రెండు దేశాల మధ్య పెద్ద వివాదమే జరిగింది.దీనిపై కోపం గా ఉన్న యావత్ భారత్ ఇప్పుడు వీళ్ళను ఓడించాలని కోరుకుంటున్నారు.మరి మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిందే.
