టీడీపీతో పాటు ఎల్లో మీడియాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో అవమానం జరిగినట్లు, కాన్వాయ్‌కి ట్రాఫిక్ ఆపడం లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ‘ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ గారిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు భద్రత ఎందుకు కల్పించలేదని అడగని పచ్చ మీడియా చంద్రబాబుకు ఏదో జరిగినట్టు శోకాలు పెడుతోంది. ఆయన కాన్వాయ్‌కి ట్రాఫిక్‌ను ఆపడం లేదట. ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట. ఒక బీసీ నాయకుడు స్పీకర్ అయితే గౌరవించాల్సిన అవసరం లేదనే మీ ఫిలాసఫీ అందరికీ తెల్సిందే చంద్రబాబూ గారూ. కిందటిసారి మీ కులపెద్ద సభాపతి అయితే తోడ్కొని వెళ్లారు. అప్పుడు మీరు పిలవకున్నా హుందాగా జగన్‌గారు మీతో పాటు నడిచి ఆయనను అభినందించారు. మీకూ ఆయనకు తేడా అదే అన్నారు.
ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ గారిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు భద్రత ఎందుకు కల్పించలేదని అడగని పచ్చ మీడియా చంద్రబాబుకు ఏదో జరిగినట్టు శోకాలు పెడుతోంది. ఆయన కాన్వాయ్‌కి ట్రాఫిక్‌ను ఆపడం లేదట. ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 15, 2019