రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసి రాష్ట్రాలు సమృద్ధిగా ఉండాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ సన్యాసికారి దీక్షను చేయనున్నారు..ఈరోజు విజయవాడ వచ్చిన స్వామివారు అమ్మవారిని దర్శించుకొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు లోక శ్రేయస్సు కొరకు సన్యాసికారి దీక్ష చేయనున్నట్లు చెప్పారు.ఈ మహోన్నత కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ మరియు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దీనికి హాజరవుతున్నారు.ఈ కార్యక్రమం సక్రమంగా జరగాలని మనమందరం కోరుకుందాం.
