వైఎస్సార్సీపీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై షాతో జగన్ ఆయన చర్చించారు. నీతి అయోగ్ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు. రాష్ట్ర సమస్యలపై వ్యవహారించాల్సిన అంశాలపై ఎంపీలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన జగన్.. భేటీ ముగిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆవశ్యకత, విభజన చట్టంలోని అంశాలపై ఆయనకు వివరించినట్టు తెలిపారు. రాష్ట్రం అన్నివిధాల ఇబ్బందుల్లో ఉండడం వల్ల సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకరించాల్సిందిగా కోరారు.. నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలోనూ ప్రత్యేకహోదా అంశాన్ని లేవనెత్తుతానని తేల్చిచెప్పారు.
ముఖ్యమంత్రిగా గెలిచాక వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసిన జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. ఇప్పటికే రెండుసార్లు హోదాగురించి ప్రస్తావించడమే కాకుండా ఎంపీలతో పార్లమెంట్ లో మాట్లాడించడం, అలాగే నీతిఆయోగ్ లో మాట్లాడేందుకు జగన్ సిద్ధమయ్యారు. కేంద్రం వద్ద హామీలు రాబట్టుకునే విధానంలోకూడా జగన్ తండ్రిని అనుసరిస్తున్నారు. కేంద్రంతో సఖ్యతతో మెలుగుతూనే కావాల్సినవాటిపై మృధువుగా ప్రశ్నించి రాబట్టుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని వేలకోట్ల రూపాయల నిధులు తెచ్చారు. అదేసమయంలో తానేమీ తక్కువ కాదని తనకున్న ప్రజాబలాన్ని సైతం చూపించే ప్రయత్నమూ చేస్తున్నారీ యువ ముఖ్యమంత్రి.