కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారయణ రెడ్డికి ఆరు గురు సోదరులు, ఇరువురు రాజకీయ వారసులు, బావ.. మొత్తం తొమ్మిది మంది ఒక్కో ప్రాంతానికి ఇన్ఛార్జిగా వ్యవహరించి రాజకీయాలు చేశారు. ఆదినారాయణరెడ్డి చెప్పినట్లే 9మందికి తొమ్మిది వీరినే నమ్ముకొని రాజకీయాలు చేసిన రామసుబ్బారెడ్డికి జీవితాంతం గుర్తుంచుకునేలా కడప ప్రజలు తీర్పు చెప్పారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు . తొలినాళ్ల నుంచి టీడీపీని నమ్ముకొని రాజకీయాలు చేసిన కుటుంబాన్ని కాదనీ, వైరిపక్ష నేతను అధినేత చంద్రబాబు దరికి చేర్చుకున్నప్పుడే ధిక్కరించాల్సిందని సీనియర్లు ఇప్పుడు మదనపడుతున్నారు. ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎమ్మెల్సీ పదవీత్యాగం చేయాలని షరతు పెట్టినప్పుడైనా ధిక్కరించి, పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తే మర్యాద దక్కేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు మదనపడుతోన్నారు. ఆదినారాయణరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి పీఆర్ కుటుంబసభ్యులు ప్రచారం చేయడంతోనే తమ కొంపమునిగిందంటున్నారు. వైఎస్ కుటుంబానికి జమ్మలమడుగులో అపారమైన అభిమానులున్నారు. వైఎస్ కుటుంబాన్ని ఆదినారాయణరెడ్డి టార్గెట్ చేస్తూ దూషించిన ఫలితం తమపై పడిందని వారు చెబుతున్నారు. జిల్లాలో టీడీపీ భారీ ఓటమికి ఆది ప్రధాన కారకుడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
