తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారుపై ఒక పక్క ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పలు తప్పుడు ఆరోపణలు చేస్తూ విషప్రచారాన్ని ప్రచారం చేస్తూ తమ పార్టీలకు చెందిన కార్యకర్తలకు ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రేణులను తప్పుడు మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఒక ప్రముఖ జాతీయ పార్టీకి సానుభూతిపరులమని చెప్పుకునే కొంతమంది నెటీజన్లు తెలంగాణలో మహిళల మిస్సింగ్ కేసులేక్కువగా ఉన్నాయి. పోలీసులు ఆ కేసులను చేధించలేకపోతున్నారు అని బురద చల్లే ప్రయత్నం చేశారు. అయితే రాష్ట్ర డీజీపీ దీనిపై వివరణ ఇవ్వడంతో అది విషప్రచారం .. ఫేక్ అని తేలింది.అయితే తాజాగా హార్యానాలో వరకట్నం బాధితురాలైన అనురాధ సోలంకి అనే మహిళపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో పాతబస్తీలో జై హిందు అన్నందుకు ముస్లీంలు దాడి చేసి కొట్టారని విషప్రచారం చేశారు ప్రతిపక్షాలకు చెందిన అభిమానులు. అయితే దీనిపై ఆరా తీయగా అది హార్యానాలో జరిగింది .. అది ఫేక్ అని తేలడంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నెటీజన్లు ఆ పోస్టులను డిలిట్ చేశారు.. అయితే సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను ప్రచారం చేస్తే కేసులు ఉంటాయని వాళ్లకు తెలియకపోవచ్చు…