కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి ప్రత్యర్థులు పక్కా ప్లాన్‌తోనే హత్య చేసిన సంగతి తెలిసిందే. పక్కా ప్లాన్ తో.. నారాయణరెడ్డిని మట్టుబెట్టడానికి దుండగులు రంగంలోకి దిగి ఎక్కడా తప్పించుకునే వీలు లేకుండా అంతా ఒక పథకం ప్రకారం హత్యకు స్కెచ్ గీసీ.. కాపు కాసి, తొలుత ఆయన కారును ట్రాక్టరుతో ఢీకొట్టించి, అనంతరం బాంబులు, వేట కొడవళ్లతో దాడి చేసి చంపేశారు. ఎదురుగా మూడు ట్రాక్టర్లు పెట్టి చంపేశారు.ఇంత దారుణమైన హత్య అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే పత్తికొండలో నారాయణ రెడ్డి ప్రజల్లోకి బాగా వెళ్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ,ఆయన క్రమంగా మరింత బలపడుతున్నారు కాబాట్టి హత్య చేశారని వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆనాడు హత్య జరిగిన తరువాత నారాయణరెడ్డి అంత్యక్రియల్లో చెప్పాడు. అప్పుడే చెప్పాడు ఈ కేసులో ఎంతటవారి అయిన వారిని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తానాని నారాయణ రెడ్డి కుటుంబానాకి భరోసా ఇచ్చారు. అంతేకాదు తన భర్త హత్య కేసు విచారణలో అన్యాయం జరిగిందంటూ చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం అందరికి తెలిసిందే. దీంతో చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబుతో సహా మరో ఇద్దరిని నిందితులుగా చేర్చి, అరెస్ట్ చేయాలని డోన్ న్యాయస్థానం కొన్ని నెలలు ముందు సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతం తన భర్త కన్న కలను కంగాటి శ్రీదేవి నేరవేరుస్తానాని ఎమ్మల్యేగా గెలిచాక పత్తికొండలో అభిమానులు ఎర్పాటు చేసిన భారీ ర్యాలీలో అన్నారు. దీంతో ఇప్పుడు కేయి కుటుంబంలో అలజడి మొదలైయ్యింది. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ దీనిపై విచారణ జరిపి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు, బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్ఐ నాగప్రసాద్‌లను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
