టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరో షాక్ తగిలింది. రవిప్రకాష్ వాడుతున్న ఖరీదైన కార్లను అలంద మీడియా యాజమాన్యం ఈ రోజు స్వాధీనం చేసుకుంది. టీవీ9 నుంచి అలంద మీడియా రవిప్రకాశ్‌ను తొలగించినప్పటికీ.. కంపెనీ వాహనాలను మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఈ సందర్భంగా అలంద మీడియా యాజమాన్యం ఇటీవల కోర్టును ఆశ్రయించింది. తమ వాహనాలకు తిరిగి ఇప్పించాలని వారు కోర్టును కోరారు. రవిప్రకాశ్ వాడుతున్న ఖరీదైన వాహనాలకు అలంద మీడియా యాజమాన్యానికి తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో కార్లను స్వాధీన పరుచుకున్నారు. కోర్టు ఆదేశాలతో రవి ప్రకాశ్ ఇంటికి చేరుకున్న పోలీసులు ముందుగా కార్లను సీజ్ చేశారు. ఆయన డ్రైవర్స్ ఫోన్లను తీసుకున్నారు. అయితే నోటీసులు లేకుండా ఇంటికి ఎలా వస్తారని రవిప్రకాశ్ భార్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.