తెలుగుదేశం ప్రభుత్వ హయంలో గుంటూరు జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటించడం ద్వారా కోట్లు దండుకుంటుంటే… మరో ఎంపీ సోదరుని సంస్థ జీవీపీ ఇన్‌ఫ్రా 982 ఎకరాల అభయరణ్యానికే ఎసరు పెట్టేందుకు స్కెచ్ వేసి గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అయితే మరీ బరితెగించి లీజులు లేకుండానే సున్నపురాయిని అడ్డగోలుగా తవ్వించి పరిశ్రమలకు విక్రయించడం ద్వారా వందల కోట్లు దండుకుంటున్నారు. జాతీయ సంపదైన ఖనిజ నిక్షేపాలను కాపాడాల్సిన, అక్రమ తవ్వకాలను, తరలింపును అడ్డుకోవాల్సిన భూగర్భ గనుల శాఖ కళ్లుండీ చూడలేని కబోదిలా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం పిడుగురాళ్ల, కోనంకి గ్రామాల పరిసరాల్లో సున్నపురాయి నిక్షేపాలను స్థానిక కూలీలతో అక్రమంగా తవ్వించి విక్రయించడం ద్వారా కొంతమేరకు ఆర్జించిన యరపతినేని టీడీపీ అధికారంలోకి వచ్చాక అడ్డూ అదుపూ లేకుండా రేయింబవళ్లు అక్రమ తవ్వకాలు సాగించారు. ఈ ఖనిజాన్ని సిమెంటు కర్మాగారాలకు సరఫరా చేస్తూ వందల కోట్లు ఆర్జించారు. అనుమతులు లేకుండా యరపతినేని సున్నపురాయి నిక్షేపాలను తవ్విస్తున్నా అధికారయంత్రాంగం అడ్డుకోలేకపోయింది. అంతేకాదు ఎన్నికల్లో ఓటమి ఖాయమని నిర్ధారణకు వచ్చిన తెలుగు తమ్ముళ్లు అసహనంతో గురజాలలో ముస్లిం మైనార్టీలపై దాడులు చేసిన రౌడీమూకలతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమావేశం కావడం అప్పట్టో సంచలనం రేపింది. పోలింగ్ రోజు కూడ టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలు ఎక్కువగా జరిగాయి. అంతేకాదు అత్యంత దారుణంగా ముస్లింల ఇళ్లకు తాగునీరు అందించే మోటార్లను సైతం తొలగించాలని నిర్ణయించి, అద్దెకు ఉండేవారిని ఖాళీ చేయాలని బెదిరిస్తూ టీడీపీ నేతలు మతోన్మాదుల మాదిరిగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సిరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయంలో జరిగిన అన్ని నేరాలను క్షుణంగ పరిశీలించి.. నేరం చేసిన వారిని తప్పకుండా జైలుకు పంపుతాడని సమచారం.
