చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధించిన అవినీతి డొంక కదిలేలా కనిపిస్తోంది. పుల్లారావుకు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశలు పెట్టుకున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు.. కానీ ఆయనకు పదవి వచ్చినప్పటినుంచీ అవినీతి కార్యక్రమాలకే పాల్పడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో నీరు- చెట్టు పథకంలో మంత్రితోపాటు ఆయన అనుచరులు వందలకోట్లు తినేసారు. అలాగే అధికారం అండతో పత్తి కొనుగోలులో గోల్‌మాల్ చేసి పత్తి కుంభకోణానికి పాల్పడ్డారు. పేదల కోసం వేయాల్సిన రోడ్ల గ్రావెల్‌ను మింగేసారు.. అందినకాడిని మట్టిని కూడా తినేసారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల ప్రాణాలు పోతుంటే ఆ సంస్థ భూములు అన్యాయంగా దుర్మార్గంగా ఆక్రమించుకున్నారు. అతని అక్రమాలపై ప్రశ్నించిన జర్నలిస్టులపైనా దాడులకు దిగారు. ఆయనే కాదు.. ఆయనగారి భార్య కూడా రాజ్యాంగేతర శక్తిగా మారారు.. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని కమీషన్లు తీసుకున్నారు. డబ్బులు దండుకున్నారు.
మంత్రి భార్య అవినీతికి పాల్పడ్డారు. ఇలా టీడీపీ పాలనలో వందలకోట్ల ప్రజాధనాన్ని మింగేసారు. మొత్తంగా చిలకలూపేటతో పాటు జిల్లావ్యాప్తంగా అవినీతి, అక్రమాలు, అరాచకాలతో రాజ్యమేలారు. అగ్రిగోల్డ్ కు చెందిన హాయ్‌ల్యాండ్ డైరెక్టర్ కనుకొల్లు ఉదయ దినాకర్ పేరుపై రిజిస్టర్ అయింది. అగ్రిగోల్డ్ భాగస్వామి ఇతని వద్దనుంచి పుల్లారావు సతీమణి తేనె వెంకాయమ్మ (ప్రత్తిపాటి వెంకట కుమారి) మొత్తం 6.19 ఎకరాలను కొనుగోలు చేసారు. అలా కొనుగోలు చేసి వాటి రేట్లు పెంచి అమ్ముకునేవారు. పుల్లారావు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఉన్న సమయం లో మార్కెట్‌యార్డుల ద్వారా ఈ కుంభకోణం జరిగింది. విశాఖ నుంచి గుంటూరు వచ్చిన సీబీఐ అధికారుల బృందం సీసీఐ కార్యాలయంలో విచారణ నిర్వహించింది. అప్పట్లో జరిగిన పత్తి కుంభకోణంలో దాదాపు రూ.540 కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని విచారణలో వెల్లడైంది.
అలాగే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చిలకలూరిపేటలో రెవెన్యూ, మున్సిపల్ ఇలా ఏ కార్యాలయంలో ఫైల్ కదలాలన్నా మేడమ్ ని కలిసి కప్పం కట్టాల్సిందేననే హుకుం జారీ చేసారు. ల్యాండ్ కన్వర్షన్ ఎకరాకు రూ.1 లక్ష వసూలు చేసారు. మంచినీటి సరఫరా పేరుతో రూ. 5 కోట్లు దండుకున్నారు. ఎంత పెద్ద వర్క్ అయినా మూడు, నాలుగు భాగాలుగా విభజించి ఒక్కరికే నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తూ భారీగా ముడుపులు తీసుకున్నారు. బాణసంచా వ్యాపారుల నుంచి ఏటా రూ.కోటి, పాన్ పరాగ్, గుట్కా హోల్‌సేల్ వ్యాపారుల నుంచి రూ. 3 కోట్లు వసూలు చేశారు. గుంటూరులో కల్తీకారం తయారీదారులను బెదిరించి రూ. 8కోట్లు దండుకున్నారు. నకిలీ విత్తనాల కుంభకోణం సైతం వీరి కనుసన్నల్లోనే జరిగిందట. స్థలాలు కబ్జా చేసి అమ్ముకునేవారు. ఆయన వ్యవహారశైలి మంత్రి అనుచరులకు వరంగా మారింది. పూర్వీకుల పేరుతో పట్టాలు ఉన్నట్లుగా సృష్టించి మంత్రి అండదండలతో పూర్ణాసింగ్, మాధవ్‌సింగ్, శంబుసింగ్ అనే వ్యక్తులు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్ముకున్నారు.
టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను అడ్డుపెట్టుకుని దోచుకున్న మొత్తం : 150 కోట్లు
పేదల బియ్యం రవాణాలో అక్రమాలు : రూ. 200 కోట్లు
ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో గ్రావెల్ దోపిడీ : రూ.500 కోట్లు
మంత్రిగాని కన్నుపడిన యడవల్లి భూముల్లో గ్రానైట్ విలువ : రూ. 3000 కోట్లు
పేట కేంద్రంగా సీసీఐ కుంభకోణం : రూ. 540 కోట్లురూ.
మున్సిపల్ పనుల్లో మంత్రి భార్య కమీషన్ : రూ.150 కోట్లు
అగ్రి గోల్డ్ ఆస్తుల కొనుగోలులో లబ్ధి : సుమారు 5 కోట్లు
ఇలా అందినకాడికి దోచుకున్న మాజీ మంత్రిగారి చిట్టా కూడా త్వరలోనే విప్పనున్నట్టు తెలుస్తోంది. విచారణ జరిపి పత్తిపాటిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.