టీడీపీ సీనియర్ నేత, మాజీస్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ దాష్టీకాలు బయటపడుతున్నాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కే ట్యాక్స్ పేరుతో కోడెల కుటుంబం విచ్చలవిడిగా సాగించిన అవినీతి, అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరుజిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్ష్మి చేసిన దారుణమైన దందాలు, వసూళ్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అధికారానికి భయపడి అణచివేతకు గురైన గొంతుకలు కొత్త ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో తిరగబడుతున్నాయి. కే ట్యాక్స్ బాధితులు గత వారం రోజులుగా నరసరావుపేట, సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లకు బారులు తీరుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సామాన్య ప్రజలపై పెత్తనం చెలాయించారు. ఎక్కడికక్కడ భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఉద్యోగాలిప్పిస్తామంటూ అమాయకుల నుంచి కోట్లు దండుకున్నారు.
See Also : చంద్రబాబు ఈరోజు సభలో చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలి సీఎం డిమాండ్
ల్యాండ్ కన్వర్షన్, అపార్ట్ మెంట్ల అనుమతుల వ్యవహారంలో భారీ వసూళ్లకు పాల్పడ్డారు. కేట్యాక్స్ పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేశారు. కోడెల శివరామ్ రియల్టర్ వంశీకృష్ణను బెదిరించి రూ.2.30 కోట్లు వసూలు చేసినట్లు నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదుచేసారు. డబ్బు ఇవ్వకపోతే పర్మిషన్లు రాకుండా కోడెల కుటుంబం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ ఆధారాలతో సహా నరసరావుపేట డీఎస్పీని ఆశ్రయించారు. కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మితోపాటు కొల్లి ఆంజనేయులు, కొల్లి నరసింహారావు, పెద్దబ్బాయి మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి రూ.7లక్షలు తీసుకొని మోసగించినట్లు పాతూరుకు చెందిన ఆళ్ల శేఖర్ ఫిర్యాదు చేసారు. సత్తెనపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జెల్ది ప్రసాద్ నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి కులంపేరుతో దూషించిన కేసులో విజయలక్ష్మిపై అట్రాసిటీ కేసు కూడా పెట్టారు.
అలాగే.. కోడెల శివరాం, పీఏ గుత్తా ప్రసాద్ తనను బెదిరించి రూ.15 లక్షలు వసూలు చేసినట్లు బిల్డర్ కోటపాటి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పొలం ఆక్రమిస్తామంటూ బెదిరించి కోడెల కుమార్తె విజయలక్ష్మి ఆమె అనుచరులు రాంబాబు, శ్రీనివాసరావు తన నుంచి రూ.15 లక్షలు వసూలు చేసినట్లు అర్వపల్లి పద్మావతి ఫిర్యాదు చేసారు. ఇలా ప్రజలను బెదిరించి ఇబ్బందులకు గురిచేసి డబ్బులు వసూలుచేయడం చర్చనీయాంశంగా మారింది. బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. దీంతో ఒక్కొక్కరిగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
అయితే వీరి బండారం బయటపడటంతో కోడెల శివరాం, విజయలక్ష్మి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విచారించేందుకు పోలీసులు ఫోన్లు చేసినా స్పందన లేదట.. బాధితుల తాకిడి పెరిగిపోయి ఏకంగా క్యూలు కడుతున్నారంటే వీరి దుర్మార్గాలను అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే వారిద్దరూ ఊరు విడిచి వెళ్లినట్లు చెబుతున్నాయి. ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఓ బాధితుడికి డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలియడంతో మరికొందరు బాధితులు కోడెల నివాసం వద్ద, కార్యాలయం వద్ద ఎదురుచూస్తున్నారు.
See Also : దౌర్జన్యం, బెదిరింపులు, రౌడియిజం , భూకభ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు అన్నిటిపై బోండా ఉమకు చుక్కలే